టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) 6వ రోజు భారత అథ్లెట్లు (Indian Athletes) శుభారంభం చేశారు. మహిళల బ్యాడ్మింటన్ (Badminton) సింగిల్స్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు (PV Sindhu) రౌండాఫ్ 16లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన సింధు.. ఏ దశలోనూ పట్టు విడువకుండా ఆడింది. ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా లేకుండా వరుసగా రెండు గేమ్స్ సాధించి.. పతకానికి మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి నిలకడగా ఆడి తన ఫామ్‌ను కొనసాగించింది.
.@Pvsindhu1 wins the match against #DEN Mia Blichfeldt with a score of 21-15, 21-13
With this, Sindhu advances to quarter-final
Wishing her all the best for the future matches! 🔥🔥🔥#Badminton#Tokyo2020 #Cheer4India#SmashForTheGlory pic.twitter.com/pTxnkKxcGv
— SAIMedia (@Media_SAI) July 29, 2021
గురువారం మధ్యాహ్నం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Pv sindhu, Tokyo Olympics