Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu Interview: ఇది నిజంగా పెద్ద ఘనతే.. కోచ్ వల్లే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో గెలిచాను

PV Sindhu Interview: ఇది నిజంగా పెద్ద ఘనతే.. కోచ్ వల్లే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో గెలిచాను

న్యూస్ 18తో పీవీ సింధు ఎక్స్‌క్లూసీవ్ ఇంటర్వ్యూ (Olympics)

న్యూస్ 18తో పీవీ సింధు ఎక్స్‌క్లూసీవ్ ఇంటర్వ్యూ (Olympics)

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం విజేత పీవీ సింధు ఎక్స్‌క్లూసీవ్ న్యూస్ 18 ఇంటర్వ్యూ

టోక్యో ఒలింపిక్స్‌ 2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ భావించినా.. సెమీస్‌లో తై జూ చేతిలో ఓడిపోయింది. కానీ ఓటమి బాధను దిగమింగి ఆ తర్వాత రోజే కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా పీవీ సింధు న్యూస్ 18తో ఎక్స్‌క్లూసీవ్‌గా మాట్లాండిది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం.

న్యూస్ 18: మాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ధన్యవాదాలు

పీవీ సింధు: అవును.. ఇప్పటి వరకు అందరితో మాట్లాడాను కానీ ఎవరికీ ఎక్స్‌క్లూసీవ్ ఇవ్వలేదు.

న్యూస్ 18: సెమీస్‌లో ఓడిపోయిన రాత్రి మీరు ఎలా ఉన్నారు? తర్వాతి రోజు మ్యాచ్‌కు ఎలా సన్నద్దం అయ్యారు?

పీవీ సింధు: అది చాలా బాధాకరమైన రోజు. సెమీస్‌లో ఓడిపోయిన తర్వాత చాలా బాదపడ్డాను. నా ఆటపై తీవ్రమైన అసంతృప్తితో ఉండిపోయాను. అయితే ఓడిపోయినందుకు బాధపడాలో లేదంటే మరో ఛాన్స్ ఉందని సంతోషించాలో అర్దం కాలేదు. ఉదయం నుంచి సెమీఫైనల్ గురించి ఆలోచించి.. చివరకు మ్యాచ్ పోగొట్టుకున్నాను. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాకు బ్రాంజ్ మెడల్ గెలిచే చాన్స్ ఉందని తెలుసు. కానీ సెమీస్ ఓడిన కొన్ని గంటల్లోనే ఆ మ్యాచ్ ఉన్నది. ఆ సమయంలో మా కోచ్ నన్ను మోటివేట్ చేశారు. తప్పకుండా నువ్వు ఈ ఓటమి నుంచి కోలుకొని ఈ మ్యాచ్ ఆడాలి అన్నారు. బ్రాంజ్ సాధించడానికి , 4 స్థానంలో నిలవడానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ఆయన చెప్పారు. అప్పుడు నేను తేరుకొని పతకంపై దృష్టిపెట్టాను.

న్యూస్ 18: మీ కోచ్ గురించి చెప్పండి. ఆయన చాలా ఎమోషనల్ ఫీలయినట్లు కనపడ్డారు. ఆయన కష్టం గురించి వివరించండి

పీవీ సింధు: నా కోచ్‌ను నేను కృతజ్ఞతలు తెలపాలి. ఆయన చాలా కష్టపడ్డారు. ఈ కరోనా కారణంగా ఆయన కనీసం కుటుంబంతో కూడా కలవలేదు. ఈ ఏడాదిలో కేవలం 13 రోజులే ఆయన కుటుంబంతో ఉన్నారు. చిన్నారి కూతురుని కూడా వదిలి వచ్చాడు. ఆయన ఎంతో గొప్పగా నాకు సాయం చేశారు. ఆయన నన్ను నమ్మారు. నా ఆటను ఆయన ఎంతో మెరుగపరిచారు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేను.

న్యూస్18: కేవలం 26 ఏళ్లలో మీరో దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యారు. రెండు ఒలింపిక్స్ మెడల్స్.. వరల్డ్ చాంపియన్ మెడల్.. ఎలా ఉంది ఆ గుర్తింపు

పీవీ సింధు: దిగ్గజం అన్నందుకు థ్యాంక్స్. నేను దాన్ని ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటాను. మెడల్ గెలిచిన తర్వాత ఏం జరిగిందో అర్దం కాలేదు. ఐదు సెకెన్ల తర్వాత సంతోషంతో అరిచాను. వావ్.. మొత్తానికి నేను మెడల్ సాధించాను అని అనుకున్నాను. 2016 రియో ఒలింపిక్స్ కంటే 2020 టోక్యో ఒలింపిక్స్ చాలా కఠినంగా అనిపించాయి. ఈ ఒలింపిక్స్‌లో ఒత్తిడే కాకుండా బాధ్యత ఉన్నది. ఎన్నో అంచనాలు ఉన్నాయి. దేశం కోసం గెలవాలని తపన ఉన్నది. అందుకే ఈ మెడల్ నాకు ఎంతో ప్రత్యేకం.

న్యూస్ 18: బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఎలా ఉన్నది?

పీవీ సింధు: ఆ మ్యాచ్ ఆడుతున్న ఇద్దరికీ అది చాలా పెద్ద మ్యాచ్. ఇద్దరం దేశం కోసం మెడల్ తేవాలనే ఆడుతున్నాము. ఇద్దరి మధ్య పాయింట్లలో పెద్దగా తేడా ఏమీ లేదు. కేవలం ఒకటి రెండు పాయింట్ల వ్యత్యాసం ఉన్నది. .ప్రతీ పాయింట్ విలువైనదే. నేను లీడింగ్‌లో ఉన్నా.. మ్యాచ్ ఎప్పుడు టర్న్ తిరుగుతుందో అర్దం కావడం లేదు. చివరి వరకు ఆమె గట్టి పోరాటం చేసింది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది. కానీ పైనల్‌గా గెలిచాను.

న్యూస్ 18: మీ తల్లిదండ్రుల స్పందన ఏంటి? మీ నాన్న చాలా కష్టపడ్డారు కదా?

పీవీ సింధు: మా తల్లింద్రుడు చాలా సంతోషంగా ఉన్నారు. నా బ్యాడ్మింటన్ ప్రయాణంలో వాళ్లు నాతో పాటు ప్రయాణించారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాము. సపోర్టింగ్ సిబ్బంది, ఇతర విషయాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ వాళ్లు నా వెన్నంటే ఉన్నారు. నాకు మెడల్ రావడం పట్ల వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు.

న్యూస్ 18: ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సింధు ఏం చేయబోతోంది?

పీవీ సింధు: నేను మంగళవారం తిరిగి వస్తున్నాను. అయితే ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నిన్నంతా మా అమ్మానాన్న చాలా బిజీగా ఉన్నారు. చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నారు. ఇంటికి అందరూ వచ్చారంటా. నేను పొద్దున్నే కాల్ మాట్లాడాను. చూడాలి.. వెళ్లగానే ఏం చేస్తానో డిసైడ్ చేసుకోలేదు.

న్యూస్ 18: ఇక అంతా సాధించేశానని అనుకుంటున్నారా? ఇంకేమైనా మిగిలి ఉందా?

పీవీ సింధు: నేను ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇంకా ఆలోచించలేదు. కొంత సమయం తీసుకుంటాను. తర్వాత ఏం చేయగలనో చూస్తాను.

న్యూస్ 18: గత ఒలింపిక్స్‌కి ఈ ఒలింపిక్స్‌కి తేడా ఏంటి?

పీవీ సింధు: రియో చాలా ప్రత్యేకమైనది. ఆ సమయంలో ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే అక్కడ అందరిలో ఒకరిగా ఉన్నాను. కానీ ఈ సారి ఒలింపిక్స్‌కు వెళ్తుంటే.. సింధు తప్పకుండా పతకం తెస్తుంది అందరూ అంచనా వేసుకున్నారు. నువ్వు పతకం తెస్తావు అంటుంటే ఒత్తిడి పెరగిపోయింది.

న్యూస్ 18: మీ విజయం మంచి ఊపు తెచ్చినట్లు ఉంది. మీ తర్వాత మెన్స్ హకీ టీమ్. ఉమెన్స్ హాకీ టీమ్ సెమీస్ వెళ్లాయి

పీవీ సింధు: మెన్స్, ఉమెన్స్ హాకీ జట్లకు అభినందనలు. నేను వుమెన్స్ హాకీ మ్యాచ్ ఫోన్‌లో లైవ్‌లో చూశాను. చాలా బాగా ఆడారు. పతకం గెలవాలని నేను కోరుకుంటున్నాను.


న్యూస్ 18: మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

పీవీ సింధు: దేశ ప్రజలందరికీ.. నా విజయాలను ఆకాంక్షించిన అభిమానులకు ధ్యవాదములు. నా విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్, సపోర్ట్ సిబ్బందికి కూడా కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

First published:

Tags: Badminton, Olympics, Pv sindhu, Tokyo Olympics