సింధుకు సిరుల పంట...ఫోర్బ్స్ టాప్-10లో చోటు..!

అమెరికన్ షట్లర్ సెరెనా విలియమ్స్ అగ్రస్ధానాన్ని దక్కించుకుంది. అత్యధిక ఆదాయం గల క్రీడాకారిణీ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం సెరెనాకు ఇది వరుసగా మూడోసారి.

news18-telugu
Updated: August 22, 2018, 5:47 PM IST
సింధుకు సిరుల పంట...ఫోర్బ్స్ టాప్-10లో చోటు..!
ఏషియాడ్‌ బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్స్‌లో పీవీ సింధు (GETTY IMAGE)
  • Share this:
ఇండియన్ టాప్ షట్లర్ పీవీ సింధుకు ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కింది. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణీల జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. సింధూ ఏడో స్ధానంలో నిలిచింది. భారత్ తరపున సింధూ ఒక్కరే టాప్-10 లిస్టులో స్ధానం సంపాదించింది. టాప్-10లో కేవలం ఇద్దరు మాత్రమే టెన్నిసేతర క్రీడాకారిణీలు చోటు దక్కించుకోగా..అందులో సింధూతో పాటు రేస్ కార్ డ్రైవర్ డానిక పాట్రిక్ ఉన్నారు. పీవీ సింధు వార్షిక ఆదాయం దాదాపు రూ.60 కోట్లుగా వెల్లడించింది ఫోర్బ్స్.

అమెరికన్ స్టార్ షట్లర్ సెరెనా విలియమ్స్ అగ్రస్ధానాన్ని దక్కించుకుంది. అత్యధికంగా సంపాదిస్తున్న ప్రపంచ క్రీడాకారిణీల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం సెరెనాకు ఇది వరుసగా మూడోసారి. గత ఏడాది తల్లి కావడంతో కొంతకాలం పాటు ఆమె టెన్నిస్‌కు దూరమైంది. ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ టెన్నిస్ ఆడుతోంది సెరెనా. టోర్నీల్లో అందుకునే ప్రైజ్‌మనీతో పాటు కమర్షియల్ డీల్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు క్రీడాకారులు. ఆ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను తయారుచేసింది.

టాప్-10 క్రీడాకారిణులు- వారి ఆదాయం (రూపాయలల్లో)
1. సెరెనా విలియమ్స్ (టెన్నిస్) - రూ.126.49 కోట్లు
2. కరోలిన్ ఓజ్నియాకి (టెన్నిస్) - రూ.90.85 కోట్లు
3. స్లోయాన్ స్టీఫెన్స్ (టెన్నిస్) - రూ.78.28 కోట్లు
4. గర్భైన్ ముగురుజ (టెన్నిస్) - రూ.76.88 కోట్లు

5. మరియా షరపోవా (టెన్నిస్) - రూ.73.38 కోట్లు
6. వీనస్ విలియమ్స్ (టెన్నిస్) - రూ.71.29 కోట్లు
7. పీవీ సింధు (బ్యాడ్మింటన్) - రూ.59.41 కోట్లు
8.సిమోనా హాలెప్ (టెన్నిస్) - రూ.53.81 కోట్లు
9. డానిక పాట్రిక్ (రేసర్)- రూ.52.42 కోట్లు
10. ఏంజెలిక్ కెర్బర్ (టెన్నిస్ ) - రూ.48.92 కోట్లు
Published by: Shiva Kumar Addula
First published: August 22, 2018, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading