Home /News /sports /

PUSHPA MOVIE CRAZE GOES TO BANGLADESH PREMIERE LEAGUE WATCH VIRAL VIDEO SRD

Viral Video : ఒడియమ్మ బడవ ఇదేందయ్య ఇదీ.. బంగ్లా క్రికెట్ కు కూడా పాకిన పుష్ప మేనియా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు.

    టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు. ఇప్ప‌టికే మ‌న దేశ క్రికెట‌ర్లు మాత్ర‌మే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) కూడా పుష్ప సినిమాలోని పాట‌ల‌కు స్టెప్పులు వేస్తూ అల‌రించాడు. తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ సీనియ‌ర్ బ్యాట‌ర్ సురేష్ రైనా (Suresh Raina) కూడా చేరాడు. ఇటీవ‌ల పుష్ప సినిమా చూసిన రైనా.. అందులోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు పుష్ప రాజ్‌గా స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. ఇక, లేటెస్ట్ గా ఈ మేనియా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కు కూడా పాకింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL 2021)‌లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో 'నీ అవ్వ తగ్గేదేలే'అనే అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    బీబీఎల్‌లో జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అమిత్ హసన్ ఊరించే బంతితో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించాడు. ఎక్స్‌ట్రా కవర్ దిశగా బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌ను ఫీల్డర్ పరుగెత్తి అద్బుతంగా అందుకున్నాడు. దాంతో అమిత్ హసన్ అల్లు అర్జున్ డైలాగ్ తగ్గేదే లే డైలాగ్‌కు సంబంధించిన మేనరిజాన్నీ ప్రదర్శించాడు. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


    అంతేకాకుండా టీమిండియా యువ క్రికెట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్ కూడా ఈ పాట‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. అలాగే పుష్ప డైలాగ్‌ను డేవిడ్ వార్న‌ర్, ర‌వీంద్ర జ‌డేజా చెప్పి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. మరోవైపు విదేశాల్లో పలువురు చిన్నారులు కూడా పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.








    View this post on Instagram






    A post shared by Suresh Raina (@sureshraina3)





    పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన మెగా హిట్ సాధించేసింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో పుష్ప సినిమా పాటలు ఊపేస్తున్నాయి. ముఖ్యమంగా యూట్యూబ్‌ను షేక్ చేసిన ఊ అంటావా పాట గానీ, లేదా శ్రీవల్లి పాటగానీ చాలా పాపులర్ అయిపోయింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Cricket, Pushpa, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు