హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : గబ్బర్ ని చితకబాదిన అభిమాని..పక్కన పోలీస్ ఉన్నా లెక్క చేయలేదు.. పాపం శిఖర్..

Viral Video : గబ్బర్ ని చితకబాదిన అభిమాని..పక్కన పోలీస్ ఉన్నా లెక్క చేయలేదు.. పాపం శిఖర్..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : పంజాబ్ కింగ్స్ నాకౌట్ చేరనందుకు శిఖర్ ధావన్ ను ఓ అభిమాని వీర కుమ్ముడు కుమ్మాడు. కొట్టడం అంటే అలా ఇలా కాదు కింద పడేసి కాళ్లతో తన్నుతూ చితకబాదాడు. ఆ అభిమాని ఎవరంటే..

భార‌త డాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖ‌ర్ ధావ‌న్ (Shikhar Dhawan) ఈ మ‌ధ్య గ్రౌండ్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్నాడు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ బన్నీ డైలాగులను తమదైన స్టైల్లో చెప్పి అలరించిన సంగతి తెలిసిందే. శిఖర్‌ ధావన్ కూడా ఆ జాబితాలో చేరి అల‌రించాడు. ‘పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై(తగ్గేదేలే)’ అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పిఆకట్టుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే గబ్బర్‌ పలు సినిమా పాటలు, డైలాగులను అనుకరించి ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అటు టీమిండియా తరఫున ఇటు ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తోన్న శిఖర్ ధావన్ కు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన శిఖర్ ధావన్ 14 మ్యాచ్ ల్లో 460 పరుగులు సాధించాడు. కానీ.. సౌతాఫ్రికా సిరీస్ లో శిఖర్ కి చోటివ్వలేదు సెలెక్టర్లు. ఇక.. పంజాబ్ కింగ్స్ కూడా లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. దీంతో.. ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ గా శిఖర్ ధావన్ పై అతని తండ్రి ఫ్రస్టేషన్ భరించలేక తుక్కుతుక్కుగా కొట్టాడు. ధావన్ ను కిందపడేసి కాళ్లతో తంతూ కసితీరా కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో ధావన్ తండ్రి మహేంద్ర పాల్ ధావన్ తో ఓ ఫన్నీ రీల్ చేశాడు. అందులో మహేంద్ర పాల్.. ధావన్ ను చేతులతో కొడుతూ కింద పడేసి కాళ్లతో తొక్కుతూ తన్నుతున్నట్టు నటించాడు.


ఓ పాత బాలీవుడ్ సినిమా క్లిప్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ రీల్ చేశాడు ధావన్. ఈ వీడియోకు క్యాప్షన్ గా " ఐపీఎల్ నాకౌట్ దశకు వెళ్లకపోయినందుకు మా డాడీ నన్ను చితకబాదుతున్నాడు.. " అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పలువురు క్రికెటర్లు ఈ వీడియోను లైక్ చేశారు.


గతంలో కూడా శిఖర్ ధావన్ ఇదే తరహాలో రీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రీల్‌లో శిఖర్ ధావన్ తన తండ్రి ముందు సినిమా డైలాగ్ మాట్లాడాడు అది విన్న తండ్రి శిఖర్​ను చెప్ప దెబ్బ కొడుతున్నట్లు నటించాడు. ఇందులో ధావన్‌ న్యాచురల్‌గా కనిపించడంతో పెద్దాయన సీరియస్‌గానే చేయి చేసుకున్నాడని వీక్షకులు అపోహ పడ్డారు. గబ్బర్‌ యాక్టింగ్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు కూడా.

First published:

Tags: IPL 2022, Punjab kings, Shikhar Dhawan, Team India, Viral Video

ఉత్తమ కథలు