• Home
 • »
 • News
 • »
 • sports
 • »
 • PUNJAB FANS LOVED VORAT KOHLI GESTURE WHAT HAPPENED AFTER MATCH JNK

IPL 2021 : కోహ్లీ చేసిన పనికి ఫిదా అవుతున్న పంజాబ్ ఫ్యాన్స్.. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది?

కోహ్లీ క్రీడా స్పూర్తికి ఫ్యాన్స్ ఫిదా [iplt20.com]

 • Share this:
  ఇండియన్ ప్రీమియర లీగ్‌లో (IPL 2021) ప్రతీ రోజు ఏదో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంటుంది. మొదట్లో చప్పగా సాగిన మ్యాచ్‌లు రానురానూ ఉత్కంఠ భరితంగా మారిపోతున్నాయి. ఒకవైపు భారీ స్కోర్లు నమోదవుతుంటే.. మరోవైపు బౌలర్లు కూడా తన టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్‌లో ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ఉండటం గమనార్హం. ఆర్సీబీకి చెందిన హర్షల్ పటేల్ 17 వికెట్లు తీసి అందరి కన్నా ముందున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ఈ సీజన్ ప్రారంభం నుంచి తప్పులు చేస్తూ ఓటములు కొని తెచ్చుకుంది. జట్టు కూర్పు సరిగా లేకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయి. అహ్మదాబాద్‌లో ఆర్సీబీతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో మాత్రం సమతూకం కలిగిన జట్టుతో బరిలోకి దిగి విజయం సాధించింది. ముఖ్యంగా హర్‌ప్రీత్ బ్రార్ (Harpreet Brar) వంటి ఆల్‌రౌండర్‌ను తుది జట్టులోకి తీసుకున్నది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రార్.. ఏకంగా ఆర్సీబీలోని బిగ్ త్రీ వికెట్లను తీశాడు. తొలుత విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన బ్రార్.. ఆ తర్వాత బంతికే గ్లెన్ మ్యాక్‌వెన్‌ను ఒక స్టన్నింగ్ బంతితో బౌల్డ్ చేశాడు. ఇక 13వ ఓవర్ తొలి బంతికే బ్రార్ ఏబీ డివిలియర్స్‌ను పెవీలియన్ పంపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతకు ముందు బ్యాటింగ్ సమయంలో కేఎల్ రాహుల్‌కు తోడుగా ఉన్నాడు. 17 బంతుల్లో 25 పరుగులు చేసి పంజాబ్ జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు.

  మ్యాచ్ ముగిసిన తర్వాత హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్ కలసి ముచ్చటించకుంటుండగా అటు వైపు కోహ్లీ వచ్చాడు. తన వికెట్ తీసిన హర్‌ప్రీత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ భుజం తట్టాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. దీన్ని ఐపీఎల్ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన వికెట్ మాత్రమే కాకుండా.. కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్న బౌలర్‌ను కోహ్లీ అభినందించడం పట్లు పంజాబ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక మంచి కెప్టెన్‌, క్రికెటర్‌లో ఉండాల్సిన లక్షణం ఇదేనని కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత హర్‌ప్రీత్ బ్రార్ మాట్లాడుతూ 'నేను పుట్టిన మోగ జిల్లా ప్రజలు ఈ రోజు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. కోహ్లీ వరుసగా బౌండరీలు కొడినే నేను భయపడలేదు. బౌలర్‌కు ఎప్పుడూ ఒక సెకెండ్ ఛాన్స్ ఉంటుంది. నా తొలి ఐపీఎల్ వికెట్ కోహ్లీది  తీయడం చాలా ప్రత్యేకం. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తప్పక రాణిస్తావని చెప్పి కెప్టెన్ రాహుల్ భాయ్ చాలా సహకరించాడు.' అని చెప్పుకొచ్చాడు.
  Published by:John Naveen Kora
  First published: