INDW vs AUSW: పూనమ్ రౌత్ క్రీడా స్పూర్తి.. అవాక్కయిన ఆసీస్ క్రికెటర్లు.. చూస్తూ ఉండిపోయిన అంపైర్

పూనమ్ రౌత్ క్రీడా స్పూర్తికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు (PC: IC)

INDW vs AUSW: ఇండియా - ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య గోల్డ్‌కోస్ట్‌లో ఏకైక పింక్ బాల్ టెస్ట్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతున్నది. అయితే రెండో రోజు భారత బ్యాటర్ పూనమ్ రౌత్ చూపించిన క్రీడా స్పూర్తి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    క్రికెట్‌లో (Cricket) ఏ బ్యాటర్ కూడా తమ వికెట్ కోల్పోవడానికి ఇష్టపడరు. అంపైర్ (Umpire) అవుట్ ఇచ్చినా ఒక్కోసారి డీఆర్ఎస్‌కు వెళ్లి తమ లక్ పరీక్షించుకుంటుంటారు. చాలా కొద్ది మంది క్రికెటర్లు మాత్రం అంపైర్‌తో సంబంధం లేకుండా.. తాము అవుట్ అని అనుకోగానే క్రీజ్‌ను విడిచిపెట్టి వెళ్తుంటారు. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ (డే/నైట్ మ్యాచ్)లో (Pink Ball Test) టీమ్ ఇండియా (Team India Women) మహిళా జట్టు ఫస్ట్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్ (Poonam Raut) ప్రదర్శించిన క్రీడా స్పూర్తి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. తొలి రోజు ఓపెనర్ షెఫాలీ వర్మ (Shefali Verma) అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పూనమ్ రెండో రోజు కూడా బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smrithi Mandhana) అద్బుతమైన సెంచరీతో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. దీంతో పూనమ్ ఇన్నింగ్స్ మొత్తం స్మృతికి సహకారం అందిస్తూ ఉండటంతో ఎక్కువగా పరుగులు చేసే అవకాశం రాలేదు. అయితే కీలక సమయంలో వికెట్ పడకుండా అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడింది.

    రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఆసీస్ బౌలర్ మోలిన్యూక్స్ వేసిన బంతిని పూనమ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ హఏలీ చేతిలో పడింది. ఆసీస్ క్రికెటర్లు అందరూ అవుట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ.. పూనమ్ మాత్రం బంతి బ్యాటుకు తగిలిందని గ్రహించి క్రీజ్‌ను వదిలి వెళ్లిపోయింది. ఒక వేళ పూనమ్ అక్కడే నిలబడితే ఆసీస్ క్రికెటర్లు చేసేది కూడా ఏమీ లేదు. కానీ పూనమ్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించి పెవీలియన్ దిశగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.







    ఆ సమయంలో ఆసీస్ క్రికెటర్లు అందరూ ఎంతో ఆశ్చర్యంతో చూస్తుండగా.. అంపైర్ కూడా పూనమ్‌ను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు బీసీసీఐ కూడా తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేసాయి. పూనమ్ చూపిన క్రీడా స్పూర్దికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు సిసలైన క్రికెటర్ అనిపించుకుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    Ishan Kishan: సచిన్‌ను చూసి భయపడ్డ ఇషాన్ కిషన్.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు తెప్పించిన సంఘటన




    ఆస్ట్రేలియా-ఇండియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు కేవలం 41 ఓవర్లే మ్యాచ్ జరగగా.. రెండో రోజు 60 ఓవర్లకే మ్యాచ్ నిలిచిపోయింది. భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. స్మృతి మంధాన సెంచరీతో ఆకట్టుకోగా.. షెఫాలీ వర్మ (31), పూనమ్ రౌత్ (36), మిథాలీ రాజ్ (30) పర్వాలేదనిపించారు. ప్రస్తుతం యాస్తికా భట్ (19) నిరాశ పరచగా.. దీప్తి శర్మ 12, తానియా భాటియా 0 ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
    Published by:John Naveen Kora
    First published: