PULWAMA ATTACK TROLLING ON TENNIS STAR SANIA FOR NOT RESPONDING ON TERROR ATTACK MIRZA TWEETS LATER CR
సానియా మీర్జాపై పుల్వామా అటాక్ ఎఫెక్ట్... మరోసారి ట్రోలింగ్‌కు గురైన టెన్నిస్ స్టార్...
సానియా మీర్జా (పాత ఫోటో)
ఓ పక్క భారత సైనికులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతే... నీ పిచ్చి ఫోటోలు పెడతావా... అంటూ బీభత్సమైన ట్రోలింగ్... ట్విట్టర్లో ఆలస్యంగా స్పందించిన సానియా... అయినా ఆగని ట్రోలింగ్...
భారత్, పాక్‌ల మధ్య ఏ చిన్న విషయం జరిగినా... ఆ ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పడుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినా... పాక్ చేతిలో భారత్ ఓడినా... సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలెడతారు నెటిజన్లు. కారణం అందరికీ తెలిసిందే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకోవడమే. పాక్ దేశస్థుడిని పెళ్లాడిన తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న ఈ టెన్నిస్ స్టార్... మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా పుల్వామా టెర్రర్ దాడి ఘటనే ఈ ట్రోలింగ్‌కు కారణం...
పుల్వామాలో ఉగ్రదాడి కారణంగా 42 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశమొత్తం స్పందించింది. అలాంటి సమయంలోనూ సానియా మీర్జా తన కొత్త డ్రెస్‌ను చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. పింక్ అండ్ వైట్ కలర్లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని... ఆ ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే సానియాకు సోషల్ మీడియా ట్రోలింగ్ ఎఫెక్ట్ మొదలైంది. ‘ఓ పక్క దేశంలో దారుణ ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే... దాని గురించి స్పందించకుండా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా?’ అంటూ నెటిజన్లు సానియాను ట్రోల్ చేసేశారు. త్వరగా పాకిస్తాన్‌కు వెళ్లిపోయి, కాపురం పెట్టు... అంటూ తీవ్రస్థాయిలో కామెంట్లు కూడా చేశారు.
ట్రోలింగ్ మొదలైన కొద్దిసేపటికి తేరుకున్న సానియా మీర్జా... పుల్వామా ఘటన గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘పుల్వామా ఘటన గురించి తెలిసి బాధపడ్డా... ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రపంచంలో టెర్రరిజానికి చోటు లేదు... శాంతి కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విట్ చేసింది సానియా. అయినా కూడా సానియాను వదలని ట్రోలర్స్... ‘త్వరలోనే పాకిస్థాన్ ప్రపంచపటం నుంచి మాయమవుతుంది. సానియా నువ్వు, నీ కుటుంబంతో కలిసి ఇండియాలో ఉండొచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
Saddened at the attack on our CRPF soldiers in #Pulawama ..my sincere condolences to the families.. there is no place for terrorism in the world.. prayers for peace .. #PulwamaAttack
సానియా మీర్జాకు ఈ విధమైన ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో ట్రోలింగ్ గురించి ముందే గ్రహించిన సానియా... తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ డీ-యాక్టివేట్ చేసేసింది. మ్యాచ్ ముగిసిన రెండు రోజుల తర్వాత గానీ రీ-యాక్టివేట్ చేయలేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.