Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

బ్యాడ్మింటన్ అభివృద్ధికి కొటక్‌తో పుల్లెల గోపీచంద్ రూ.35కోట్ల డీల్..

బ్యాడ్మింటన్ అభివృద్ధికి కొటక్‌తో పుల్లెల గోపీచంద్ రూ.35కోట్ల డీల్..

కొటక్ అందించే సహకారంతో గచ్చిబౌలిలోని తమ అకాడమీ పక్కనే మరో ఆరు అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మించనున్నట్టు గోపీచంద్ తెలిపారు. దాంతో పాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు.

  దేశంలో బ్యాడ్మింటన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ నడుం బిగించింది. తమ అకాడమీ బ్యాడ్మింటన్ సేవలను మరింత విస్తరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌తో గోపీచంద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కొటక్ సహకారంతో గోపీచంద్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌, రీసెర్చ్&డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించనున్నారు. బ్యాడ్మింటన్ ఔత్సాహికులకు వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సదుపాయాలను కల్పించేందుకే కొటక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు గోపీచంద్ తెలిపారు.

  గోపీచంద్ అకాడమీతో ఒప్పందంలో భాగంగా కొటక్ సంస్థ తరుపున రూ.35కోట్లు ఇవ్వబోతున్నాం. కార్పోరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా విద్యారంగంతో పాటు క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యాడ్మింటన్‌తో పాటు మరిన్ని క్రీడలకు మా సహాయ సహకారాలు అందిస్తాం. అందులో రెజ్లింగ్‌కు మా తొలి ప్రాధాన్యం ఉంటుంది.
  దీపక్ గుప్తా, కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

  కొటక్ అందించే సహకారంతో గచ్చిబౌలిలోని తమ అకాడమీ పక్కనే మరో ఆరు అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మించనున్నట్టు గోపీచంద్ తెలిపారు. దాంతో పాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు. చాలా దేశాల్లో లాగా మనదేశంలో చిన్నతనం నుంచే క్రీడాకారులను తీర్చిదిద్దే పరిస్థితి లేదని.. దీన్ని మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  First published:

  Tags: Hyderabad, Pullela Gopichand, Saina Nehwal

  ఉత్తమ కథలు