హోమ్ /వార్తలు /క్రీడలు /

PSL 2023 : పాకిస్తాన్ సూపర్ లీగ్ లో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే నవ్వాగదు

PSL 2023 : పాకిస్తాన్ సూపర్ లీగ్ లో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే నవ్వాగదు

PC : PakistanSuperLeague/Twitter

PC : PakistanSuperLeague/Twitter

PSL 2023 : మా లీగ్ ముందు మీ లీగ్ జుజూబీ.. అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్  (Pakistan) మాజీ క్రకెటర్లు. మీ లీగ్ లో డబ్బు ఉండొచ్చు.. మా లీగ్ లో క్రికెట్ ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PSL 2023 : మా లీగ్ ముందు మీ లీగ్ జుజూబీ.. అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్  (Pakistan) మాజీ క్రకెటర్లు. మీ లీగ్ లో డబ్బు ఉండొచ్చు.. మా లీగ్ లో క్రికెట్ ఉంటుంది. అల్లాటప్పా క్రికెట్ కాదు సూపర్ క్రికెట్ అంటూ గతంలో చాలా మంది పాక్ మాజీ క్రికెట్లరు కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మ్యాచ్ లను నిర్వహించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ లీగ్ లో దొంగలు పడ్డారు.

ఇది కూడా చదవండి : ప్రపంచకప్ లో టీమిండియా రాత మారాలంటే కోచ్ గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరిలో ఒకర్ని కోచ్ గా చేయాల్సిందే

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పీఎస్ఎల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం అక్కడ సీసీటీవీ కెమెరాలు అమర్చారు. అలాగే మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేయడం కోసం ఉపయోగించే సామగ్రి కూడా ఈ స్టేడియంలో ఉంచారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఈ సామగ్రిపై కన్నేశారు.

స్టేడియంలో భద్రత కోసం పెట్టిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలను కొందరు దొంగలు దోచుకెళ్లారు. వీళ్లు వీటిని తీసుకెళ్లడం స్టేడియం బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ కెమెరాలతోపాటు మ్యాచ్ లను లైవ్ టెలికాస్టింగ్ చేసేందుకు ఉపయోగించే రికార్డింగ్, మానిటర్ లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఈ వస్తువుల విలువ పదుల లక్షల్లో ఉంటాయని స్టేడియం నిర్వాహకులు పేర్కొంటున్నారు. బయట ఉన్న సీసీకెమెరాల ఫుటేజి ఆధారంగా పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు నిందితులు ఎవరూ పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్ఎల్ లీగులో సెక్యూరిటీ సమస్యలు చాలా సాధారణం అయిపోయాయి. దాదాపుగా మ్యాచులు జరుగుతున్న ప్రతి చోటా ఈ సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. దొంగలను పట్టించే సెక్యూరిటీ కెమెరాలనే దొంగలు పట్టుకెళ్లడంపై ఇప్పుడు జోక్స్ పేలుతున్నాయి. మరొక విషయం ఏంటంటే.. గడాఫీ స్టేడియంలో మ్యాచ్ లను నిర్వహిస్తోన్నందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వాహకులు పంజాబ్ (పాకిస్తాన్) గవర్నమెంట్ కు నయా పైసా  ఇవ్వలేదంట. దాంతో పంజాబ్ ప్రభుత్వం ఈ మ్యాచ్ లకు సెక్యూరిటీని ఇచ్చేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

First published:

Tags: Cricket, IPL, Pakistan, Sports

ఉత్తమ కథలు