Viral Video : PSL -6 లో బూతుల పురాణం..అఫ్రిది అల్లుడితో గొడవకు దిగిన పాక్ మాజీ కెప్టెన్..

Photo Credit : Twitter

Viral Video : క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పీఎస్ఎల్ వంటి లీగ్ లు వచ్చాకా ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు పరస్పరం గొడవలకు దిగడం కామన్ గా మారింది.

 • Share this:
  క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పీఎస్ఎల్ వంటి లీగ్ లు వచ్చాకా ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు పరస్పరం గొడవలకు దిగడం కామన్ గా మారింది. లేటెస్ట్ గా పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌ ( PSL -6) 2021లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, యువ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది పరస్పరం ఒకరినొకరు తమ నోళ్లకు పని చెప్పుకున్నారు. మంగళవారం రాత్రి క్వెటా గ్లాడియేటర్స్‌, లాహోర్‌ ఖలండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. అఫ్రిది విసిరిన బౌన్సర్ బంతి గ్లాడియేటర్స్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. దాంతో సహనం కోల్పోయిన సర్ఫరాజ్.. నోరుజారాడు. అందుకు అఫ్రిది కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. విషయంలోకి వెళితే... ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షాహిన్ షా అఫ్రిది ఆఖరి బంతిని 147కిమీ వేగంతో వేశాడు. బౌన్సర్ రూపంలో వచ్చిన బంతిని ఫుల్ చేసేందుకు గ్లాడియేటర్స్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కి దొరకని బంతి వేగంగా వెళ్లి అతడి హెల్మెట్‌కి బలంగా తాకింది. ఆపై థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. దీంతో సర్ఫరాజ్ సింగిల్ కోసం పరుగెత్తుతూ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వెళ్లాడు. అక్కడే నిల్చొని బాల్‌ని చూస్తున్న షాహిన్ అఫ్రిదితో గొడవకి దిగాడు. ఆపై నాకే బౌన్సర్‌ వేస్తావా? అన్నట్లుగా కోపంతో చూశాడు.

  సర్ఫరాజ్ అహ్మద్ మాటలకి ఘాటుగా బదులిచ్చిన..షాహిది అఫ్రిది కాబోయే అల్లుడు షాహిన్ అఫ్రిది అతనికి చేరువగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో లాహోర్‌ కెప్టెన్‌ సోహైల్‌ అక్తర్‌, సీనియర్‌ ఆటగాడు మహ్మద్‌ హపీజ్‌ వచ్చి వారిద్దరిని విడదీశారు. ఫీల్డ్‌ అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఓవర్‌ ముగిసిన అనంతరం హఫీజ్‌.. సర్ఫారజ్‌ దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆపై ఫిజియో వచ్చి సర్ఫరాజ్ గాయాన్ని పరిశీలించి వెళ్లాడు. ఒక సీనియర్‌ ఆటగాడిపై నియంత్రణ కోల్పోయి అఫ్రిది ఇలా చేయడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు కెప్టెన్ కాకపోవడంతో..యంగ్ ప్లేయర్లు కూడా రెచ్చిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 158 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌లో వెథర్‌లాండ్‌ 48 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ సర్ఫరాజ్​ 34, అజమ్‌ ఖాన్‌ 33 పరుగులతో రాణించారు. ఫాల్కనర్ మూడు వికెట్లు పడగొట్టాడు.

  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్‌ ఖలందర్స్‌ 18 ఓవర్లలో140 పరుగులకే ఆలౌట్‌ అయి 18 పరుగులతో ఓటమిని చవిచూసింది. టీమ్ డేవిడ్ ఒక్కడే 46 పరుగులతో పోరాడాడు. ఉస్మాన్ షిన్వారీ, ఖుర్రం షాజాద్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. కరోనా ఎఫెక్ట్ తో ఫిబ్రవరిలో వాయిదా పడ్డ పీఎస్ఎల్ ఈ నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
  Published by:Sridhar Reddy
  First published: