Home /News /sports /

Lionel Messi: అరుదైన రికార్డు నెలకొల్పిన లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 7వ సారి బాలెన్ డి ఓర్ అవార్డు సొంతం

Lionel Messi: అరుదైన రికార్డు నెలకొల్పిన లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 7వ సారి బాలెన్ డి ఓర్ అవార్డు సొంతం

7వ సారి బాలెన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్న లియోనల్ మెస్సీ (PC: Ballon D Or)

7వ సారి బాలెన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్న లియోనల్ మెస్సీ (PC: Ballon D Or)

Lionel Messi: ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే 'బాలన్ డి ఓర్' అవార్డును అర్జెంటీనా కెప్టెన్, పీఎస్జీ ఆటగాడు లియోనల్ మెస్సీ గెలుచుకున్నాడు. రికార్డు స్థాయిలో 7వ సారి ఈ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించాడు.

    ఫుట్‌బాల్ (Football) దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్, పారీస్ సెయింట్ జెర్మైన్ (Paris Saint Germain) ఆటగాడు లియోనల్ మెస్సీ (Lionel Messi) చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక 'బాలెన్ డి ఓర్' (Ballon D O'r) అవార్డును రికార్డు స్థాయిలో 7వ సారి తన సొంతం చేసుకున్నాడు. సోమవారం రాత్రి పారీస్‌లో జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో అతడికి ఈ 2021కి సంబంధించిన అవార్డును అందజేశారు. ఆరు సార్లు బాలెన్ డి ఓర్ అవార్డును గెలిచి గతంలోనే రికార్డు నెలకొల్పిన మెస్సీ.. తన రికార్డును తానే బద్దలు కొడుతూ 7వ సారి ఈ ప్రతిషాత్మక అవార్డును అందుకున్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో 'ఆస్కార్' గా భావించే ఈ అవార్డుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. అనేక మంది పురుష, మహిళా క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పోలాండ్ స్ట్రైకర్ రాబర్ట్ లెవాండోస్కీ రెండో స్థానంలో, ఇటాలియన్ మిడ్ ఫీల్డర్ జోరిగిన్హో మూడు స్థానంలో నిలిచారు. లియోనల్ మెస్సీ తొలి సారిగా 2009లో ఈ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 2010, 2011, 2012తో మెస్సీనే ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2015, 2019లో మరో రెండు సార్లు బాలెన్ డి ఓర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

    గత ఏడాది కరోనా (Corona) కారణంగా బాలెన్ డి ఓర్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కానీ తాజాగా పారీస్‌లో ఈ అవార్డుల ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. లియోనల్ మెస్సీ గత ఏడాది బార్సిలోనా ఎఫ్‌సీ (FC Barcelona) తరపున 48 మ్యాచ్‌లలో 38 గోల్స్ చేశాడు. అంతే కాకుండా అర్జెంటీనా జట్టుకు గత ఏడాది 'కోపా అమెరికా' (Copa America) టైటిల్‌ను అందించాడు. ఫైనల్‌లో బ్రెజిల్‌ను ఓడించి 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ ఒక పెద్ద టైటిల్‌ను అందించాడు. మెస్సీ కెరీర్‌లో కూడా ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్. 34 ఏళ్ల వయసులో కూడా చురుకుగా కదులుతూ ఆటలో మరిన్ని మైళ్లు రాళ్లు అందుకుంటున్నాడు. ఇక ఇటీవలే మెస్సీ బార్సిలోనా జట్టును వీడి పారీస్ సెయింట్ జెర్మైన్‌లో చేరాడు. రెండు దశాబ్దాల పాటు బార్సిలోనాలో ఆడిన మెస్సీ... ఆ జట్టును వీడుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆ జట్టుకోసం 778 మ్యాచ్‌లలో 672 గోల్స్ చేశాడు. 'ఈ అవార్డును మరో సారి అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. రెండేళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నప్పుడు ఇక ఇదే చివరి సారి అని అనుకున్నాను. కానీ కోపా అమెరికా టైటిల్ గెలవడం ద్వారానే ఈ అవార్డు తిరిగి నన్ను వరించిందని అనుకుంటున్నాను' అని మెస్సీ అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానించాడు.

    Ind Vs Nz : కాన్పూర్ టెస్ట్ డ్రా అవ్వడంతో టీమిండియాకు భారీ నష్టం.. గెలిచి ఉంటే..!







    IND vs NZ: తొలి టెస్టు డ్రా.. అద్భుతంగా మ్యాచ్‌ను కాపాడిన టెయిలెండర్లు.. చివరి వికెట్ తీయలేకపోయిన ఇండియా



     ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డును మహిళా విభాగంలో స్పానిష్ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్ అలెక్సియా పుటెల్లాస్‌కు దక్కింది. బాలెన్ డి ఓర్ అవార్డును అలెక్సియా గెలుచుకోవడం ఇదే తొలి సారి. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన అలెక్సియా మొత్తం 26 గోల్స్ చేసింది. మహిళల విభాగంలో బాలెన్ డి ఓర్ అవార్డును తొలి సారి 2018లో ప్రవేశ పెట్టారు. మొదటి అవార్డు అడా హెగర్‌బర్గ్‌ను వరించింది. ఇక 2019లో అమెరికాకు చెందిన మెగన్ రాపినోయ్ దక్కించుకున్నది. ఈ సారి అందించిన మూడో అవార్డు అలెక్సియా కైవసం చేసుకున్నది.


    మహిళా విభాగంలో బాలెన్ డి ఓర్ అవార్డును దక్కించుకున్న అలెక్సియా పుటెల్లాస్ (PC: Ballon D Or)


    ప్రముఖ ఫ్రెంచ్ పుట్‌బాల్ మ్యాగజైన్ 'ఫ్రాన్స్ ఫుట్‌బాల్' ఈ అవార్డును 1956 నుంచి అందిస్తున్నది. 2010 నుంచి 2015 మధ్యలో ఈ అవార్డును ఫిఫా అందించే 'ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'తో కలిపేశారు. అప్పట్లో దీన్ని 'ఫిఫా బాలెన్ డి ఓర్'గా పిలిచేవారు. కానీ 2016 నుంచి తిరిగి రెండు అవార్డులను విడదీశారు. దీంతో ఎప్పట్లాగానే బాలెన్ డి ఓర్ అవార్డును ఇస్తున్నారు. బాలెన్ డి ఓర్ అంటే బంగారు బంతి అని అర్దం. మెస్సీ ఈ అవార్డును 7 సార్లు గెలుచుకోగా.. క్రిస్టియానో రొనాల్డో 5 సార్లు బాలెన్ డి ఓర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
    Published by:John Kora
    First published:

    Tags: Football, Lionel Messi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు