హోమ్ /వార్తలు /క్రీడలు /

డోపింగ్ టెస్టులో పట్టుబడటానికి కారణం చెప్పిన పృథ్వీషా.. ఆ రోజు ఆ పని చేయకుండా ఉండాల్సింది

డోపింగ్ టెస్టులో పట్టుబడటానికి కారణం చెప్పిన పృథ్వీషా.. ఆ రోజు ఆ పని చేయకుండా ఉండాల్సింది

పృథ్వీషా డోప్ టెస్టులో ఎలా పట్టు బడ్డాడు? (PC: BCCI)

పృథ్వీషా డోప్ టెస్టులో ఎలా పట్టు బడ్డాడు? (PC: BCCI)

ఓపెనర్‌గా తన కెరీర్‌ను నిర్మించుకుంటున్న దశలో క్రికెటర్ పృథ్వీషా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. టీమ్ ఇండియాలో ఏ సీనియర్ క్రికెటర్‌పై పడని డోపింగ్ మచ్చ ఈ ముంబై బ్యాట్స్‌మాన్‌పై పడింది. 8 నెలల నిషేధానికి దారి తీసిన ఆ సంఘటన గురించి షా ఏమని చెబుతున్నాడంటే..

ఇంకా చదవండి ...

టీమ్ ఇండియా ఓపెనర్, యువ క్రికెటర్ పృథ్వీషా (Pruthvi Shaw) 2019లో డోపింగ్ టెస్టులో (Doping Test) విఫలమై క్రికెట్ నుంచి 8 నెలల నిషేధానికి (Ban) గురయిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడే కెరీర్ నిర్మించుకుంటున్న యువ క్రికెటర్‌పై డోపీ అనే మచ్చ రావడంతో పృథ్వీషా చాలా కుంగుబాటుకు లోనయ్యాడు. ఆనాటి ఘటన గురించి ఏనాడూ మాట్లాడని షా.. తాజాగా ఒక ఒక ఇంటర్వ్యూలో తన మనసులో బాధను చెప్పుకున్నాడు. తాను తెలియక చేసిన తప్పని.. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు. '2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడటానికి ఇండోర్ వెళ్లాను. అక్కడ ఒక రోజు రాత్రి భోజనం చేసిన అనంతరం విపరీతమైన దగ్గు మొదలైంది. నీళ్లు తాగినా అసలు తగ్గడం లేదు. దీంతో నాన్నకు ఫోన్ చేసి నా బాధను చెప్పాను. అయితే దగ్గరలో ఉండే మెడికల్ షాప్‌కు వెళ్లి కాఫ్ సిరప్ కొనుక్కొని తాగమని చెప్పాడు. నేను నా ఫిజియోతో కూడా సంప్రదించకుండా వెంటనే వెళ్లి కాఫ్ సిరప్ కొని తాగాను. ఆ రోజు నాకు ఉపశమనం లభించింది. కానీ సిరప్ తాగిన మూడో రోజే నా శాంపిల్స్ డోప్ టెస్టు కోసం తీసుకున్నారు. ఆ టెస్టులో నేను పాజిటివ్‌గా తేలాను. నేనొక డోపీగా తేల్చేవారు. అసలు నాకు ఏం చేయాలో అర్దం కాలేదు. దాని గురించి నా మాటల్లో చెప్పలేను' అని పృథ్వీషా అన్నాడు.

నా జీవితంలో అదొక కష్టతరమైన పిరియడ్. ఇన్నాళ్లూ తనను ఇష్టపడిన సహచరులు, క్రికెట్ అభిమానులు ఏమనుకుంటారో అని బాగా ఆందోళన చెందాను. కెరీర్ కుదురుకుంటున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. డోపీగా మారి నిషేధానికి గురవడంతో ఇంట్లో రెండున్నర నెలలు గడిపాను. ఆ సమయంలో పదే పదే డోప్ టెస్టు గురించిన ఆలోచనలే వచ్చేవి. దీంతో బాగా కుంగిపోయాను. అయితే తనపై బీసీసీఐ 8 నెలల నిషేధాన్ని రెండున్నర నెలలకు కుదించింది. అదొక ఊరటగా భావించాను. అప్పటికే నేను అంతర్జాతీయ ఆటకు దూరమైన సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడంతోనే తగ్గింపు లభించింది.


నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన పృథ్వీషా 2020లో న్యూజీలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అదే ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ఆకట్టుకోలేక పోయాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. డోపింగ్ టెస్టు ప్రభావం పృథ్వీషాపై బలంగా పడింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఆ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడుతూ తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విశేషంగా రాణించాడు. అయినా విదేశాల్లో సరైన రికార్డు లేదని అతడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు.

First published:

Tags: Bcci, Cricket, Delhi Capitals, Prithvi shaw, Team India

ఉత్తమ కథలు