ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం కానున్నది. కరోనా (Corona) కారణంగా గత ఏడాది వాయిదా పడిన సీజన్ 8 (Season 8) తిరిగి ఈ ఏడాది నిర్వహించడానికి మార్షల్ స్పోర్ట్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ హోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 22 నుంచి అన్ని మ్యాచ్‌లు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో కేవలం ఓకే వేదికకు లీగ్‌ను పరిమితం చేశారు. ప్రేక్షకులు లేకుండా పూర్తి బయోబబుల్ వాతావరణంలో లీగ్ జరుగనున్నది. ఇక ఈ సారి తెలుగు రాష్ట్రాల టీమ్ తెలుగు టైటాన్స్‌పై (Telugu Titans) అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన వేలంలో పలువురు రైడర్లు, డిఫెండర్లు కొనుగోలు చేసింది. దీంతో జట్టు సమతుల్యంతో బలంగా ఉన్నది. ఇప్పటి వరకు తెలుగు టైటాన్స్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఈ సారి మ్యాచ్‌లన్నీ న్యూట్రల్ వెన్యూలో జరుగుతుండటం టైటాన్స్‌కు కలసి వస్తుందని భావిస్తున్నారు.
తెలుగు టైటాన్స్ జట్టులో మంచి టాలెంట్ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. కానీ సరైన సమయంలో ప్రదర్శన చేయక ప్రతీ సారి టైటిల్ ఆశలు వమ్మవుతున్నాయి. గతంలో రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే 2019 సీజన్‌లో మాత్రంపూర్తిగా పేలవ ప్రదర్శన చేసింది. 12 జట్లనున్న ఈ లీగ్‌లో 11వ స్థానంతో సరిపెట్టుకున్నది. అయితే ఈ సారి కొత్త జట్టుతో బరిలోకి దిగుతున్నది. ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు కూడా అందుబాటులో ఉన్నారు. జట్టులో ఉన్న సిద్దార్థ్ శిరీష్ దేశాయ్ జట్టు భారం మోయబోతున్నాడు. అతడు తప్పకుండా మ్యాజిక్ తీసుకొని వస్తాడని అందరూ నమ్ముతున్నారు. సీజన్ 7లో బాహుబలిగా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్.. తిరిగి జట్టులోకి రావడం మరింత బలాన్ని పెంచింది. ఇక సందీప్ కొండల కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. లోకల్ బాయ్ అయిన ఆ కుర్రాడు.. తెలుగు టైటాన్స్ గెలుపులో కీలకంగా వ్యవహరించనున్నాడు.
తెలుగు టైటాన్స్ జట్టు:
రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్
డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా
తెలుగుటైటాన్స్ మ్యాచ్‌లు
డిసెంబర్ 22 - తమిళ్ తలైవాస్ (రాత్రి. 8.30)
డిసెంబర్ 25 - పునేరీ పల్టన్ (రాత్రి 8.30)
డిసెంబర్ 28 - హర్యానా స్టీలర్స్ (రాత్రి 8.30)
జనవరి 1 - బెంగళూరు బుల్స్ (రాత్రి 8.30)
జనవరి 3 - పట్నా పైరేట్స్ (రాత్రి 8.30)
జనవరి 5 - దబాంగ్ దిల్లీ (రాత్రి 8.30)
జనవరి 8 - యూ ముంబా (రాత్రి 8.30)
జనవరి 11 - గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8.30)
జనవరి 15 - యూపీ యోధా (రాత్రి 8.30)
జనవరి 17 - బెంగాల్ వారియర్స్ (రాత్రి 8.30)
జనవరి 19 - జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8.30)
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pro Kabaddi League