PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. బెంగళూరు (Bengaluru) వేదికగా పీకేఎల్ లో రెండో వారం ఆరంభమైంది. శుక్రవారం మూడు మ్యాచ్ లు జరగ్గా మూడు కూడా ప్రేక్షకులను అలరించాయి. తొలి పోరులో యు ముంబా (U Mumba) 39-32తో తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas)పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి నిమిషాల్లో తడబడిన తలైవాస్ సీజన్ లో రెండో ఓటమిని చవి చూసింది. యు ముంబా రైడర్ గుమాన్ సింగ్ 12 పాయింట్లతో అదరగొట్టాడు. ఆశిష్ కూడా 10 పాయింట్లతో అతడికి చక్కటి సహకారం అందించాడు. ఇక తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచినా జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.
ఇక అనంతరం జరిగిన రెండో పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 44-31తో హరియాణా స్టీలర్స్ పై గెలిచింది. జైపూర్ కు ఇది రెండో విజయం.. మూడు మ్యాచ్ ల్లో రెండు గెలుపు ఒక ఓటమితో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లతో పింక్ పాంథర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్ 8 పాయంట్లతో అతడికి సహకారం అందించాడు. ఇక హరియాణా రెయిడర్ మీతు 16 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయినప్పటికీ జట్టు విజయం మాత్రం సాధించలేకపోయింది.
It was #UMumba time at the Shree Kanteerava Indoor Stadium????
And now it's time for some ???? ???? ???? and ????#vivoProKabaddi #FantasticPanga #CHEvMUM pic.twitter.com/L54A3hez1G — ProKabaddi (@ProKabaddi) October 14, 2022
???? That's 5️⃣ points in the ????????????????????????????????' kitty as they hand the ???????????????????????????????? their first defeat in #vivoProKabaddi Season 9 ????????#FantasticPanga #HSvJPP pic.twitter.com/vrKznsVyut
— ProKabaddi (@ProKabaddi) October 14, 2022
ఇక చివరిగా జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ 47-37తో పుణేరి పల్టాన్ పై ఘనవిజయం సాధించింది. ఈ పోరులో ఒక దశలో పుణేరి పల్టాన్ ఆధిక్యంలో నిలిచింది. అయితే గుజరాత్ రెయిడర్ రాకేష్ వరుస పెట్టి రైడ్ పాయింట్లతో తన జట్టుకు పాయింట్లను తీసుకువచ్చాడు. అతడి ధాటికి పుణేరి పల్టాన్ దగ్గర జవాబే లేకపోయింది. కీలక సమయాల్లో పుణేరి పల్టాన్ డిఫెండర్లు తప్పులు చేయడం కూడా గుజరాత్ కు కలిసి వచ్చింది. గుజరాత్ రెయిడర్ రాకేశ్ 15 పాయింట్లు సాధించాడు. పుణే రెయిడర్ అస్లాం ఇనామ్ దార్ 19 పాయింట్లు సాధించినా ఓటమి పక్షానే నిలిచాడు. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ టాప్ స్కోరర్లుగా నిలిచిన రెయిడర్ టీం ఓడిపోవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Gujarat, Haryana, Jaipur, Kabaddi, Mumbai, Pro Kabaddi League, Pune, Tamil nadu