హోమ్ /వార్తలు /క్రీడలు /

PKL Season 9 : కూతకు వేళైంది.. తొడ గొట్టేందుకు తెలుగు టైటాన్స్ సిద్ధం.. ప్రొ కబడ్డీ లీగ్ లో టైటాన్స్ షెడ్యూల్ ఇదే

PKL Season 9 : కూతకు వేళైంది.. తొడ గొట్టేందుకు తెలుగు టైటాన్స్ సిద్ధం.. ప్రొ కబడ్డీ లీగ్ లో టైటాన్స్ షెడ్యూల్ ఇదే

PC : TWITTER

PC : TWITTER

Pro Kabaddi League 9 : కబడ్డీ.. కబడ్డీ.. కూత పెట్టేందుకు ప్లేయర్లు సిద్ధమయ్యాారు. ప్రత్యర్థి ప్లేయర్లను అవుట్ చేసి తొడ గొట్టేందుకు కసిగా ఉన్నారు. రైడర్ల మెరుపు విన్యాసాలను తమ కండ బలంతో అడ్డుకునేందుకు డిఫెండర్లు సై అంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pro Kabaddi League 9 : కబడ్డీ.. కబడ్డీ.. కూత పెట్టేందుకు ప్లేయర్లు సిద్ధమయ్యాారు. ప్రత్యర్థి ప్లేయర్లను అవుట్ చేసి తొడ గొట్టేందుకు కసిగా ఉన్నారు. రైడర్ల మెరుపు విన్యాసాలను తమ కండ బలంతో అడ్డుకునేందుకు డిఫెండర్లు సై అంటున్నారు. భారతీయ పల్లెటూరి గేమ్ కబడ్డీ మరోసారి మనముందుకు వచ్చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 9వ సీజన్ అక్టోబర్ 7న ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి పీకేఎల్ 9వ సీజన్ టైటిల్ కోసం మొత్తం 12 జట్లు సై అంటున్నాయి. తొలి సీజన్ నుంచి ఆడుతున్నా తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలువలేకపోయింది. సీజన్ 2, 4 సీజన్లలో నాకౌట్ దశకు చేరుకున్నా.. కీలకమైన పోరుల్లో ఓడిపోయి నిరాశ పరిచింది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సీజన్ లో పూర్తిగా నిరాశ పరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ కోసం జట్టులో చాలా మార్పులు జరిగాయి. గత సీజన్ నుంచి పాఠాలను నేర్చుకుని ఈసారి అద్బుత ఆటతీరుతో తెలుగు ఫ్యాన్స్ ను అలరిస్తామని తెలుగు టైటాన్స్ మేనేజ్ మెంట్ కూడా పేర్కొంది. తెలుగు టైటాన్స్ తన తొలి పోరును అక్టోబర్ 7న (శుక్రవారం) బెంగళూరు బుల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ఆరంభం కానుంది.  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

తెలుగు టైటాన్స్ జట్టు

రైడర్స్ : అభిషేక్ సింగ్, మోను గోయత్, సిద్ధార్థ్ దేశాయ్, రజ్నీష్, అంకిత్ బెనివల్, వినయ్, అమన్ కడియాన్,

డిఫెండర్స్ : సుర్జీత్ సింగ్, పర్వేశ్, వైష్ణవ్ భరద్వాజ్, ఆదర్శ్, రవీందర్ పహల్, విజయ్ కుమార్, నితిన్, మోహిత్, మోహిత్ పహల్, ముహమ్మద్ షిహాస్

ఆల్ రౌండర్స్ : మోసెన్ జఫారీ, హనుమంతు, హమిద్ మిర్జాయ్, రవీందర్

ఇది కూడా చదవండి : టి20 ప్రపంచకప్ లో టీమిండియా బ్రహ్మాస్త్రం ఇతడే.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

షెడ్యూల్

ఎప్పుడుఎవరితోవేదికసమయం
అక్టోబర్ 7బెంగళూరు బుల్స్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 9బెంగాల్ వారియర్స్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 11పట్నా పైరేట్స్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 15దబంగ్ ఢిల్లీబెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 18పుణెరి పల్టాన్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 22జైపూర్ పింక్ పాంథర్స్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 25హరియాణా స్టీలర్స్బెంగళూరురాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 29గుజరాత్ జెయింట్స్పుణేరాత్రి గం. 8.30లకు
అక్టోబర్ 31యూపీ యోధాపుణేరాత్రి గం. 8.30లకు
నవంబర్ 2యు ముంబాపుణేరాత్రి గం. 8.30లకు
నవంబర్ 5తమిళ్ తలైవాస్పుణేరాత్రి గం. 8.30లకు

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hyderabad, India vs South Africa, Kabaddi, Pro Kabaddi League, Telugu

ఉత్తమ కథలు