PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 10వ తేదీతో లీగ్ దశ పూర్తి కానుంది. లీగ్ దశ ముగిశాక టాప్ 6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ఇక హైదరాబాద్ (Hyderabad) వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ 43-28 తేడాతో యూపీ యోధాస్ పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో తమిళ్ తలైవాస్ ఖాతాలో 66 పాయింట్లు చేరాయి. దాంతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. యూపీ యోధాస్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తలైవాస్ తరఫున నరేందర్ 10 పాయింట్లతో సూపర్ ‘10’ను పూర్తి చేశాడు. అజింక్య పవార్ 9 పాయింట్లతో అతడికి చక్కటి సహకారం అందించాడు. యూపీ యోధాస్ తరఫున దుర్గేశ్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 57- 44తో పట్నా పైరేట్స్ పై విజయం సాధించింది. బెంగళూరు తరఫున భరత్ 20 పాయింట్లతో చెలరేగిపోయాడు. నీరజ్ నర్వాల్ 10 పాయింట్లతో అతడికి చక్కటి సహకారం అందించాడు. పట్నా తరఫున రోహిత్ 10 పాయింట్లతో మెరిశాడు. బెంగళూరు బుల్స్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
Thalaivas' Thumping Triumph sees them secure their maiden playoff appearance! Rate this win with 1 emoji. We go with ????#vivoProKabaddi #FantasticPanga #CHEvUP pic.twitter.com/cqCBrRza4r
— ProKabaddi (@ProKabaddi) December 7, 2022
The Bulls were charged & raged in style ???? A win by 1️⃣3️⃣ points highlights their dominance!#vivoProKabaddi #FantasticPanga #PATvBLR pic.twitter.com/nixxKpe9fC
— ProKabaddi (@ProKabaddi) December 7, 2022
ఒక్క స్థానం రేసులో నాలుగు జట్లు
ప్రొ కబడ్డీ లీగ్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా.. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్ 6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి అయితే ఐదు జట్లు (జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్, యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్) ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. అయితే ఒక స్థానం కోసం నాలుగు జట్లు (దబండ్ ఢిల్లీ , గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్)లు పోటీ పడుతున్నాయి. ఇక తెలుగు టైటాన్స్ తో పాటు యు ముంబా, పట్నా పైరేట్స్ లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. గురువారం దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియరస్ మధ్య పోటీ జరగనుంది. ఇందులో దబంగ్ ఢిల్లీ విజయం సాధిస్తే ఆ జట్టు ఆరో టీంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ కు చేరతాయి. మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లను ఆడాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Hyderabad, Kabaddi, Patna, Pro Kabaddi League, Tamil nadu, Uttar pradesh