PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022లో తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పుణే వేదికగా జరుగుతున్న నాలుగో వారం పోటోల్లో తలైవాస్ జట్టు 49-39తో దబంగ్ ఢిల్లీ (Dabang Delhi)పై ఘనవిజయం సాధించింది. తలైవాస్ తరఫున నరేందర్ 24 రెయిడ్ పాయింట్లతో అదరగొట్టాడు. అతడి దూకుడు ముందు దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ కుదేలైంది. తన 24 పాయింట్లలో 7 బోనస్ రూపంలో రావడం విశేషం. మరోసారి టాకిల్ రూపంలో సాధించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున అశు మాలిక్ 14 పాయింట్లతో రాణించాడు. అయితే కీలక ప్లేయర్ నవీన్ కుమార్ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించాడు.
ఇక అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 37-31తో జైపూర్ పింక్ ఫాంథర్స్ పై నెగ్గింది. బెంగళూరు బుల్స్ కు ఇది ఆరో విజయం కావడం విశేషం. బెంగళూరు తరఫున భరత్ 10 పాయింట్లతో సూపర్ 10 చేశాడు. వికాశ్ ఖండోలా 9 పాయింట్లతో అతడికి సహకారం అందించాడు. ఇక పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో రాణించాడు. అయితే కీలక సమయాల్లో పాయింట్లను సాధించిన బెంగళూరు బుల్స్ విజేతగా నిలిచింది.
???? ???????????????????????????????? ???????????????????? ????@tamilthalaivas get the victory in style as they beat the defending champions ????#vivoProKabaddi #FantasticPanga #CHEvDEL pic.twitter.com/MBb6bOjmYW
— ProKabaddi (@ProKabaddi) October 30, 2022
We've started to believe that @BengaluruBulls' matches are not for the faint-hearted ???? They consolidate the top spot in the standings after beating @JaipurPanthers ????#vivoProKabaddi #FantasticPanga #JPPvBLR pic.twitter.com/O9Bf4QOI1d
— ProKabaddi (@ProKabaddi) October 30, 2022
ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో బెంగళూరు బుల్స్ సీజన్ టేబుల్ టాపర్ గా నిలిచింది. టాప్ ప్లేస్ లో ఉన్న దబంగ్ ఢిల్లీని రెండో స్థానానికి నెట్టింది. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్ ల్లో 6 గేమ్స్ లో నెగ్గి మరో రెండింటిలో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఓవరాల్ గా 34 పాయింట్లతో టేబుల్లో టాప్ ర్యాంక్ కు చేరుకుంది. ఇక దబంగ్ ఢిల్లీ 28 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తమిళ్ తలైవాస్ మూడు విజయాలతో 20 పాయింట్లు సాధించి 9 వ స్థానంలో ఉంది. తెలుగు టైటాన్స్ ఒక విజయం ఏడు ఓటములతో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ చేరతాయి. 3, 4, 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన రెండు జట్లు టాప్ 2లో నిలిచిన జట్లతో సెమీఫైనల్స్ ఆడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Kabaddi, Pro Kabaddi League, Pune, Tamil nadu