PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో తెలుగు టైటాన్స్ (Telugu Titans) ఓటముల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) వేదికగా మ్యాచ్ లు జరగుతున్నాయి. సొంత ప్రేక్షకుల సమక్షంలో కూడా తెలుగు టైటాన్స్ ఆట మారడం లేదు. వరుసగా ఓడిపోతూనే ఉంది. శనివారం జరిగిన పోరులో పుణేరి పల్టాన్ 38-25 తేడాతో తెలుగు టైటాన్స్ పై ఘనవిజయం సాధించింది. సీజన్ లో తెలుగు టైటాన్స్ కు ఇది 15వ ఓటమి కావడం గమనార్హం. ఆడిన 17 మ్యాచ్ ల్లో కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గిన తెలుగు టైటాన్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ ను తెలుగు టైటాన్స్ చివరిదైన 11వ స్థానంతో ముగించే అవకాశం ఉంది.
ఆట ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ దూకుడు కనబరిచింది. వారి దూకుడుకు తెలుగు టైటాన్స్ డిఫెండర్లు కళ్లెం వేయలేకపోయారు.తెలుగు టైటాన్స్ తరఫున ఆదర్శ్ మాత్రమే 9 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ప్లేయర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఇక అదే సమయంలో పుణే తరఫున అస్లాం ఇనామ్ దార్ 8 పాయింట్లతో.. పంకజ్ మోహిత్ 7 పాయింట్లతో రాణించారు. ఓవరాల్ గా మ్యచ్ లో పుణే జట్టు 20 రెయిడ్ పాయింట్లతో పాటు 10 టాకిల్ పాయింట్లతో తెలుగు టైటాన్స్ ను దెబ్బ తీసింది. ఇక అదే సమయంలో తెలుగు టైటాన్స్ కేవలం 8 రెయిడ్ పాయింట్లను మాత్రమే సాధించింది. ప్రత్యర్థిని పట్టేయడంలో మాత్రం తెలుగు టైటాన్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. తెలుగు టైటాన్స్ ను పుణే రెండు సార్లు ఆలౌట్ చేస్తే.. మన జట్టు మాత్రం ప్రత్యర్థిని ఒక్కసారి కూడా ఆలౌట్ చేయలేకపోయింది.
????️ in ????️ Isko kehte hai ???????????????????????? ????@PuneriPaltan's winning streak continues as they beat @Telugu_Titans ????#vivoProKabaddi #FantasticPanga #PUNvTT pic.twitter.com/ATzoNvF0WS
— ProKabaddi (@ProKabaddi) November 26, 2022
U Mumba KO Bengal Warriors in Season 9, once again ????????#vivoProKabaddi #FantasticPanga #MUMvBEN pic.twitter.com/zKPsmMiLUs
— ProKabaddi (@ProKabaddi) November 26, 2022
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో యు ముంబా 49-41తో బెంగాల్ వారియర్స్ పై ఘనవిజయం సాధించింది. యు ముంబా తరఫున గుమాన్ సింగ్ 14 పాయింట్లతో రెచ్చిపోయాడు. ఆశిశ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇక బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 13 పాయింట్లతో రాణించినా అది తన జట్టును గెలిపించలేకపోయింది. తాజా విజయంతో పుణే జట్టు పాయింట్ల పట్టికలో 69 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది. 59 పాయింట్లతో జైపూర్.. 58 పాయింట్లతో బెంగళూరు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశ పూర్తి అయ్యాక టాప్ 6లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. టాప్ 2 జట్లు నేరుగా సెమీఫైనల్స్ కు చేరతాయి. మూడు నుంచి 6 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సెమీస్ కోసం జరిగే క్వాలిఫయింగ్ రౌండ్ జరగుతుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengal, Hyderabad, Kabaddi, Mumbai, Pro Kabaddi League, Pune