హోమ్ /వార్తలు /క్రీడలు /

PKL 2022 : ఆఖరి సమరంలో తొడగొట్టిన పింక్ పాంథర్స్.. పీకేఎల్ చాంపియన్ గా జైపూర్..

PKL 2022 : ఆఖరి సమరంలో తొడగొట్టిన పింక్ పాంథర్స్.. పీకేఎల్ చాంపియన్ గా జైపూర్..

PC : Twitter

PC : Twitter

PKL 2022 : నువ్వా -నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అంతిమ సమయంలో ఆఖరికి విజయం జైపూర్ పింక్ పాంథర్స్ నే వరించింది. ఈ సీజన్ అసాంతం అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ ఫైనల్ ఫైట్ లో కూడా అదే జోరు కొనసాగించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నెల రోజులకు పైగా అలరిస్తూ వస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ (Pro kabaddi League) 2022 సీజన్ లో విజేతగా నిలిచింది జైపూర్ పింక్ పాంథర్స్. నువ్వా -నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అంతిమ సమయంలో ఆఖరికి విజయం జైపూర్ పింక్ పాంథర్స్ నే వరించింది. ఈ సీజన్ అసాంతం అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ ఫైనల్ ఫైట్ లో కూడా అదే జోరు కొనసాగించింది. పుణెరి పల్టాన్ పై 33-29 పాయింట్ల తేడాతో విజయ భేరి మోగించి పీకేఎల్ 2022 ఛాంపియన్ గా నిలిచింది. పింక్ పాంథర్స్ లో అర్జున్ దేశ్వాల్, అజిత్ కుమార్ ఆరు రైడింగ్ పాయింట్లతో హీరోలుగా నిలిచారు. ఇక, సునీల్ కుమార్ మరో జైపూర్ హీరోగా నిలిచాడు. ఐదు టాకిల్స్ తో పాటు మొత్తం ఆరు పాయింట్లు సాధించి.. తగ్గేదే లే అని నిరూపించాడు. ఇక, ఇది జైపూర్ పింక్స్ పాంథర్స్ కి రెండో పీకేఎల్ టైటిల్.

ఇక, పుణెరి పల్టాన్ లో కూడా ఆదిత్య షిండే ఐదు రైడ్ పాయింట్లతో మెరిశాడు.ఆకాష్ షిండే నాలుగు రైడ్ పాయింట్లు సాధించాడు. అభినేష్, ఇస్మాయిల్ నభీభక్ష్ నాలుగు టాకిల్స్ పాయింట్లతో సత్తా చాటినా పుణెరి పల్టాన్ ను విజేతగా నిలపలేకపోయారు.

హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఫస్టాఫ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 14-12 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఫస్టాఫ్ లో ఏ జట్టు కూడా ఆలౌట్ కాలేదు. తొలి అర్ధభాగంలో జైపూర్ ఏడు రైడ్ పాయింట్లు సాధిస్తే.. పుణెరి పల్టాన్ మూడు పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. ఇక, టాకిల్స్ విషయానికి వస్తే.. జైపూర్ ఆరు పాయింట్లు సాధిస్తే.. ఏడు పాయింట్లు పుణెరి పల్టాన్ సొంతమయ్యాయి. ఎక్స్ ట్రా పాయింట్లు పుణెరి 2 సాధిస్తే.. ఒక పాయింట్ మాత్రమే జైపూర్ సాధించింది.

ఇక, సెకండాఫ్ లో కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. విజయం కోసం నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. అయితే, సెకండాఫ్ లో పుణెరి పల్టాన్ ఔటవ్వడంతో రెండు పాయింట్లు సాధించింది జైపూర్ పింక్ పాంథర్స్. ఇక, ఫైనల్ మ్యాచులో సినీతారలు సందడి చేశారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే , రోహిత్ శెట్టి వంటి సినీ సెలబ్రిటీల తళుక్కులతో ప్రొ కబడ్డీ తుది సమరానికి ఓ కళ వచ్చింది.

ఇక, సెమీఫైనల్ పోరులో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ను 29-49 స్కోరు తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ మట్టికరిపించింది. ఇక అదే సమయంలో పుణేరి పల్టాన్ తన సెమీస్ పోరులో 39-37తో తమిళ్ తలైవాస్ పై చెమటోడ్చి నెగ్గింది.

First published:

Tags: Kabaddi, Pro Kabaddi League, Sports

ఉత్తమ కథలు