PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో మరో ఉత్కంఠ పోరుకు వేదికైంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ (Dabang Delhi)తో యూపీ యోధా (UP Yodha) తలపడింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ 44-42తో యూపీ యోధాపై విజయం సాధించింది. తద్వారా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం దబంగ్ ఢిల్లీ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. యూపీ యోధా 3 మ్యాచ్ ల్లో 7 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 13 పాయింట్లు, మంజీత్ 12 పాయింట్లు సాధించారు. ఇక యూపీ తరఫున సురేంద్ర గిల్ ఒంటరి పోరాటం చేశాడు. అతడు ఏకంగా 21 పాయింట్లు సాధించాడు. అయినప్పటికీ ఇతర ప్లేయర్లు విఫలం కావడంతో యూపీ ఓటమి పక్షాన నిలిచింది
యూపీ జోరు
తొలి అర్ధ భాగంలో యూపీ జోరు కనబరిచింది. ఆట మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి రైడర్లను పట్టేస్తూ.. వారి డిఫెన్స్ ను ఛేదిస్తూ ఈజీగా పాయింట్లు సాధించింది. ముఖ్యంగా గిల్ చెలరేగిపోయాడు. ప్రదీప్ నర్వాల్ కూడా తొలి హాఫ్ లో పాయింట్లు సాధించాడు. అయితే ఆట మరికొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా రెయిడ్ కు వెళ్లిన మంజీత్ సూపర్ రైడ్ తో చెలరేగిపోయాడు. ఒకే రైడ్ లో నలుగురిని అవుట్ చేశాడు. ఇక్కడి నుంచి ఆట మారింది. అప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన యూపీ ఒక్కసారిగా ఢీలా పడింది. రెండో అర్ధ భాగంలో ఢిల్లీ చెలరేగింది. మంజీత్ తో పాటు నవీన్ కుమార్ కూడా చెలరేగడంతో యూపీని రెండు సార్లు ఆలౌట్ చేసింది. అయితే రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఢిల్లీపై యూపీ ఒక పాయింట్ తో లీడ్ లో నిలిచింది. అయితే మరోసారి రైడ్ కు వెళ్లిన మంజిత్ బోనస్ తో పాటు యూపీ ప్లేయర్ ను అవుట్ చేశాడు. ఇక ప్రదీప్ నర్వాల్ రెయిడ్ కు వెళ్లగా.. ప్రత్యర్థిని టచ్ చేసేకంటే కూడా ముందు లాబీని టచ్ చేసి అవుటయ్యాడు. దాంతో ఢిల్లీ 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. సురేంద్ర గిల్ తన జట్టు స్కోరులో సగం పాయింట్లు సాధించినా అతడి పోరాటం వృధాగా మిగిలింది.
Mausam ho ya game, north mein garma-garmi toh honi he hai ???? HT: #UP 25:15 #DEL FT: #UP 42:44 #DEL A Dabang comeback by Delhi makes it 3 wins in a row for them ????#vivoProKabaddi #FantasticPanga #UPvDEL pic.twitter.com/ixQwhaBdT5
— ProKabaddi (@ProKabaddi) October 12, 2022
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 33-42తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు తరఫున భరత్ 8 పాయింట్లు సాధించాడు. రేపు ఆటకు విశ్రాంతి దినం. మళ్లీ శుక్రవారం పోటీలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Delhi, Kabaddi, Pro Kabaddi League, Uttar pradesh