ఇండియాలో గ్రామీణ క్రీడగా పేరు తెచ్చుకున్న కబడ్డీ (Kabaddi) ఆటను తెలియని వారుండరు. పాఠశాల, కళాశాల స్థాయిలో కబడ్డీకి మంచి ఆదరణ ఉన్నది. ఈ క్రీడను 1990లో ఆసియా క్రీడల్లో ప్రవేశ పెట్టగా వరుసగా 16 ఏళ్ల పాటు ఇండియానే విజేతగా నిలిచింది. ఇక ఇది బంగ్లాదేశ్ జాతీయ క్రీడకూడా. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పంజాబ్, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ ఉన్నది. అయితే క్రికెట్‌లో ఐపీఎల్ (IPL) వచ్చిన తర్వాత దాని మార్కెట్ వాల్యూ పెరగడంతో.. కబడ్డీని కూడా లీగ్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో 2014లో తొలి సారిగా ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) ప్రారంభమైంది. 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్.. ప్రస్తుతం 12 జట్లకు చేరుకున్నది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్‌లో 7 సీజన్లు పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన పీకేఎల్ సీజ్ 8 కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది సరికొత్తగా డిసెంబర్ 22 నుంచి ప్రోకబడ్డీ లీగ్ ప్రారంభం కానున్నది. బెంగళూరులో (Bengaluru) తొలి మ్యాచ్ జరుగనుండగా.. పూర్తి షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు ఇంకా విడుదల చేయలేదు.
జట్లు.. యాజమాన్యం..
పీకేఎల్ తొలి సీజన్‌లో కేవలం 8 జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ ప్రస్తుతం లీగ్‌లో 12 జట్లు ఉన్నాయి. ఆ జట్లు ఏంటి? వాటి యజమానులు ఎవరో ఒకసారి చూద్దాం.
బెంగాల్ వారియర్స్: బెంగాల్ వారియర్స్ జట్టును బర్త్‌రైట్ గేమ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఇది ఫ్యూచర్ గ్రూపలో ఒక సబ్సిడరీ. ఈ జట్టులో సినిమా యాక్టర్ అక్షయ్ కుమార్‌కు కూడా భాగస్వామ్యం ఉన్నది.
బెంగళూరు బుల్స్ : బెంగళూరు బుల్స్ జట్టును చెన్నైకి చెందిన కోస్మిక్ గ్లోబల్ మీడియా కొనుగోలు చేసింది. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడంలో ఇండియా నెంబర్ 1 సంస్థగా పేరు తెచ్చుకున్న కోస్మిక్ తొలి సారి క్రీడారంగంలోకి అడుగు పెట్టింది.
దబాంగ్ దిల్లీ : దబాంగ్ దిల్లీ జట్టుకు రాధా కపూర్ యజమాని. ప్రో కబడ్డీ లీగ్‌లో మహిళా ఓనర్ కలిగిన ఏకైక జట్టు ఇదే. ఆమె డూ ఇట్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ద్వారా ఈ జట్టును నడిపిస్తున్నారు.
గుజరాత్ జెయింట్స్ : భారత బిలియనీర్లలో ఒకడైన గౌతమ్ అదానీ ఈ గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్టును కొనుగోలు చేశారు. క్రీడారంగంలోకి అడుగుపెట్టాలనే ఆయన కోరికను ఇలా తీర్చుకున్నారు.
హర్యాణా స్టీలర్స్ : ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ హర్యాణా స్టీలర్స్ జట్టును కొనుగోలు చేసింది. ఈ జట్టును ఒక విజయవంతమైన కబడ్లీ క్లబ్‌గా తీర్చి దిద్దింది.
జైపూర్ పింక్ పాంథర్స్ : బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, నటి ఐశ్వర్యారాయ్ ఈ జట్టు సహ యజమానులుగా ఉన్నారు. వీరితో పాటు జీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ వైడ్ అనే సంస్థ కూడా ఈ జట్టులో భాగస్వామ్యం కలిగి ఉన్నది.
పట్నా పైరేట్స్ : కేవీఎస్ ఎనర్జీ అండ్ స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ పట్నా పైరేట్స్ జట్టును కొనుగోలు చేసింది. దీనికి రాజేశ్ షా యజమాని. ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా దీనికి పేరున్నది.
పునేరీ పల్టన్స్ : పూణే కేంద్రంగా ఏర్పాటు చేసిన పునేరీ పల్టన్స్ జట్టుకు కైలాశ్ కండ్పల్ యజమానిగా ఉన్నారు. ఆయన ఇన్‌స్యూర్‌కోట్ స్పోర్ట్స్ అనే సంస్థ ద్వారా ఈ జట్టును ఏర్పాటు చేశారు.
తమిళ్ తలైవాస్ : తమిళ్ తలైవాస్ జట్టులో చాలా మంది సెలెబ్రిటీలకు భాగస్వామ్యం ఉన్నది. నిమ్మగడ్డ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లకు ఈ జట్టులో వాటా ఉన్నది.
తెలుగు టైటాన్స్ : హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన తెలుగు టైటాన్స్ జట్టును గ్రీన్‌కో గ్రూప్, కోర్ గ్రూన్‌కోగ్రూప్ కంపెనీలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు ఈ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు.
యూ ముంబా : యూ ముంబా జట్టు ప్రో కబడ్డీ లీగ్‌లో చాలా పాపులర్ జట్టు. యునిలైజర్ వెంచర్స్ లిమిటెడ్ ఈ జట్టును నిర్వహిస్తున్నది. ఈ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాల యజమానిగా ఉన్నారు.
యూపీ యోధా : ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్ లీగ్ గేమ్స్ ఈ జట్టుకు యజమాని. గ్రంధి కిరణ్ కుమార్ యూపీ యోధా జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు.
Shreyas Iyer: టీమ్ ఇండియా చరిత్రలో ఒకే ఒక్కడు.. టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్
ఏ జట్టులో ఎవరున్నారు?
బెంగాల్ వారియర్స్:
రైడర్స్: ఆకాశ్ పికల్‌ముండే, మనీందర్ సింగ్. రవీంద్ర కుమావత్, రిషాంక్ దేవడిగ, సుకేశ్ హెడ్జ్, సుమిత్ సింగ్,
డిఫెండర్: దర్శన్ జే, విజిన్ తంగదురయ్, వినోద్ కుమార్, అమిత్ , ప్రవీణ్, సచిన్ విట్టల, అబ్జోర్ మొహజెర్మిగాని, రింకు నర్వాల్, రోహిత్ బన్నే
ఆల్‌రౌండర్ : ఇస్మాయిల్ నబీబక్ష్, మనోజ్ గౌడ, రోహిత్
బెంగళూరు బుల్స్:
రైడర్స్: అబుల్ ఫజల్ మగ్సోదుల్ మహాలి, బాంటీ, చంద్రన్ రంజిత్, దీపక్ నర్వాల్, డోంగ్ జియోన్ లీ, మోర్ జీబీ, పవన్ సెహరావత్
డిఫెండర్స్: మయూర్ కదమ్, మోహిత్ సెహరావత్, మహేందర్ సింగ్, జియావుర్ రెహ్మాన్, సౌరభ్ నందల్, అమిత్ షెరోన్, అంకిత్, వికాస్
దబాంగ్ దిల్లీ:
రైడర్స్: అజయ్ ఠాకూర్, ఆషు మాలిక్, ఎమద్ సెదఘట్నియా, నవీన్ కుమార్, నీరజ్ నర్వాల్, సుశాంత్ సాయిల్
డిఫెండర్స్: జీవ కుమార్, మోహిత్, సుమిత్, జోగీందర్ నర్వాల్, మొహమ్మద్ మాలక్, వికాస్ కుమార్ డి,
ఆల్ రౌడర్స్: బలరాం, మన్‌జిత్ చిల్లర్, సందీప్ నర్వాల్, విజయ్ జగ్లన్
గుజరాత్ జెయింట్స్:
రైడర్స్: అజయ్ కుమార్, హర్మన్‌జిత్ సింగ్, హర్షిత్ యాదవ్, మహేంద్ర రాజ్‌పుత్, మనీందర్ సింగ్, ప్రదీప్ కుమార్, రతన్ కే, సోను
డిఫెండర్స్: అంకిత్, రవీందర్ పహల్, పర్వేశ్ భైన్స్‌వల్, గిరీష్ మారుతి ఎర్నక్, సుమిత్, సొలేమాన్ పెహ్లేవాని, సునిల్ కుమార్
ఆల్‌రౌండర్: హదీ ఒష్తోరక్
హర్యానా స్టీలర్స్:
రైడర్స్: మొహమ్మద్ ఇస్మాయేల్, వికాస్ చిల్లర్, వికాశ్ కండోలా, వినయ్,
డిఫెండర్స్ : రవి కుమార్, చంద్ సింగ్, రాజేశ్ గుర్జార్, సురేందర్ నాదా,
ఆల్‌రౌండర్స్: అజయ్, బ్రిజేందర్ చౌదరి, హమీద్ నదీర్, రాజేశ్ నర్వాల్, రోహిత్ గులియా, వికాస్ జగ్లన్
జైపూర్ పింక్ పాంథర్స్:
రైడర్స్: అమిన్ నొస్రతి, అమిర్ హొస్సేన్ మలేకి, అర్జున్ దేశ్వాల్, అశోక్, నవీన్, సునిల్ గులియా, అమిత్ నగార్
డిఫెండర్స్: పవన్ టీఆర్, అమిత్ హుడా, ఎలవరసన్ ఏ, సందీప్ ధుల్, షౌల్ కుమార్, అమిత్ ఖర్బ్, ధర్మరాజ్ చేరలతన్, విశాల్ లాథర్
ఆల్‌రౌండర్స్: దీపక్ హుడా, నితిన్ రావల్, సచిన్ నర్వాల్
పట్నా పైరేట్స్:
రైడర్స్: గుమన్ సింగ్, మోహిత్, మోను, మోను గోయత్, ప్రశాంత్ కుమార్ రాయ్, రాజ్వీర్‌సిన్హ్ చవన్, సచిన్ తన్వార్, సెల్వమని కే,
డిఫెండర్స్: మోనిరుల్ చౌదరి, నీరజ్ కుమార్, సందీప్, శుభమ్ షిండే, సౌరవ్ గులియా, సునిల్
ఆల్ రౌండర్స్: సి. సజిన్, సాహిల్ మన్, షాడ్లోయ్ చియానే
పునేరి పల్టన్స్:
రైడర్స్: మోహిత్ గోయత్, నితిన్ తోమర్, పంకజ్ మోహితే, పవన్ కుమార్, రాహుల్ చౌదరి, విశ్వాస్
డిఫెండర్స్: అభినేశ్ నాదరాజన్, జాదవ్ షహాజి, బల్దేవ్ సింగ్, హడీ తాజిక్, సౌరవ్ కుమార్, సంకేత్ సావంత్, కరమ్‌వీర్, సోంబిర్, విశాల్ భరద్వాజ్
ఆల్ రౌండర్స్: ఈ సుభాష్, గోవింగ్ గుర్జార్, విక్టర్ ఒబెరాయ్
తమిళ్ తలైవాస్:
రైడర్స్: అజింక్య పవార్, అతుల్ ఎంఎస్, భవాని రాజ్‌పుత్, కే. ప్రపంజన్, మన్‌జీత్
డిఫెండర్స్: ఎం. అభిషేక్, సుర్జీత్ సింగ్, హిమాన్షు, సాగర్, సాహిల్, తుహిన్ తరఫ్‌దర్
ఆల్ రౌండర్స్: అన్వర్ సహీద్ బాబా, సాగర్ క్రిష్ణ, సంతాపన సెల్వమ్, సౌరభ్ పాటిల్
తెలుగు టైటాన్స్:
రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్
డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా
యూ ముంబా:
రైడర్స్: అభిషేక్ సింగ్, జషన్ దీప్ సింగ్, నవ్‌నీత్, రాహుల్ రాణా, అజిత్ కుమార్
డిఫెండర్స్: హరీందర్ కుమార్, ఫజల్ అత్రాచలి, సునిల్ సిద్ధ్‌గవలి, రింకు హెచ్ సీ
ఆల్ రౌండర్స్: అజింక్య కాప్రే, ఆశిష్ కుమార్, మోహ్‌సెన్ మగ్సోదులు, పంకజ్
యూపీ యోధ:
రైడర్స్: అంకిత్, గుల్వీర్ సింగ్, జేమ్స్ నమాబా కమ్వేటి, మొహమ్మద్ తఘి, ప్రదీప్ నర్వాల్, సాహిల్, శ్రీకాంత్ జాదవ్, సురీందర్ గిల్,
డిఫెండర్ : ఆషు సింగ్, ఆశిష్ నగార్, నితేశ్ కుమార్, గౌరవ్ కుమార్, సుమిత్
ఆల్ రౌండర్స్: గుర్దీప్, నితిన్ పన్వార్
KS Bharat: 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేఎస్ భరత్
ప్రో కబడ్డీ సీజన్ వారీ విజేతలు:
సీజన్ | ఏడాది | విజేత | రన్నరప్ | బెస్ట్ రైడర్ | బెస్ట్ డిఫెండర్ |
1 | 2014 | జైపూర్ పింక్ పాంథర్స్ | యూ ముంబా | అనూప్ కుమార్ | మన్‌జీత్ చిల్లర్ |
2 | 2015 | యూ ముంబా | బెంగళూరు బుల్స్ | కాశీలింగ్ అడాకే | రవీందర్ పహల్ |
3 | 2016 | పట్నా పైరేట్స్ | యూ ముంబా | ప్రదీప్ నర్వాల్ | మన్‌జీత్ చిల్లర్ |
4 | 2016 | పట్నా పైరేట్స్ | జైపూర్ పింక్ పాంథార్స్ | రాహుల్ చౌదరి | ఫజెల్ అత్రాచలి |
5 | 2017 | పట్నా పైరేట్స్ | గుజరాత్ జెయింట్స్ | ప్రదీప్ నర్వాల్ | సురీందర్ నాడా |
6 | 2018 | బెంగళూరు బుల్స్ | గుజరాత్ జెయింట్స్ | పవన్ షెహ్రావత్ | నితీశ్ కుమార్ |
7 | 2019 | బెంగాల్ వారియర్స్ | దబాంగ్ దిల్లీ | పవన్ షెహ్రావత్ | ఫజెల్ అత్రాచలి |
షెడ్యూల్ :
పీకేఎల్ సీజన్ 8 పూర్తి షెడ్యూల్
డేట్ | తొలి మ్యాచ్ | రెండో మ్యాచ్ | మూడో మ్యాచ్ |
డిసెంబర్ 22 | బెంగళూరు బుల్స్ Vs యూ ముంబా | తెలుగు టైటాన్స్ Vs తమిళ్ తలైవాస్ | బెంగాల్ వారియర్స్ Vs యూపీ యోధా |
డిసెంబర్ 23 | గుజరాత్ జెయింట్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్ | దబాంగ్ దిల్లీ Vs పునేరీ పల్టాన్స్ | హర్యానా స్టీలర్స్ Vs పట్నా పైరేట్స్ |
డిసెంబర్ 24 | యూ ముంబా Vs దబాంగ్ దిల్లీ | తమిళ్ తలైవాస్ Vs బెంగళూరు బుల్స్ | బెంగాల్ వారియర్స్ Vs గుజరాత్ జెయింట్స్ |
డిసెంబర్ 25 | పట్నా పైరేట్స్ Vs యూపీ యోధా | పునేరీ పల్టన్ Vs తెలుగు టైటాన్స్ | జైపూర్ పింక్ పాంథర్స్ Vs హర్యానా స్టీలర్స్ |
డిసెంబర్ 26 | గుజరాత్ జెయింట్స్ Vs దబాంగ్ దిల్లీ | బెంగళూరు బుల్స్ Vs బెంగాల్ వారియర్స్ | |
డిసెంబర్ 27 | తమిళ్ తలైవాస్ Vs యూ ముంబా | యూపీ యోధా Vs జైపూర్ పింక్ పాంథర్స్ | |
డిసెంబర్ 28 | పునేరీ పల్టన్ Vs పట్నా పైరేట్స్ | తెలుగు టైటాన్స్ Vs హర్యానా స్టీలర్స్ | |
డిసెంబర్ 29 | దబాంగ్ దిల్లీ Vs బెంగాల్ వారియర్స్ | యూపీ యోధా Vs గుజరాత్ జెయింట్స్ | |
డిసెంబర్ 30 | జైపూర్ పింక్ పాంథర్స్ Vs యూ ముంబా | హర్యానా స్టీలర్స్ Vs బెంగళూరు బుల్స్ | |
డిసెంబర్ 31 | తమిళ్ తలైవాస్ Vs పునేరీ పల్టన్ | పట్నా పైరేట్స్ Vs బెంగాల్ వారియర్స్ | |
జనవరి 1 | యూ ముంబా Vs యూపీ యోధా | బెంగళూరు బుల్స్ Vs తెలుగు టైటాన్స్ | దబాంగ్ దిల్లీ Vs తమిళ్ తలైవాస్ |
జనవరి 2 | గుజరాత్ జెయింట్స్ Vs హర్యానా స్టీలర్స్ | పునేరీ పల్టన్ Vs బెంగళూరు బుల్స్ | |
జనవరి 3 | బెంగాల్ వారియర్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్ | తెలుగు టైటాన్స్ Vs పట్నా పైరేట్స్ | |
జనవరి 4 | హర్యానా స్టీలర్స్ Vs యూ ముంబా | యూపీ యోధా Vs తమిళ్ తలైవాస్ | |
జనవరి 5 | పునేరీ పల్టన్ Vs గుజరాత్ జెయింట్స్ | దబాంగ్ దిల్లీ Vs తెలుగు టైటాన్స్ | |
జనవరి 6 | పట్నా పైరేట్స్ Vs తమిళ్ తలైవాస్ | బెంగళూరు బుల్స్ Vs జైపూర్ పింక్ పాంథర్స్ | |
జనవరి 7 | బెంగాల్ వారియర్స్ Vs హర్యానా స్టీలర్స్ | జైపూర్ పింక్ పాంథర్స్ Vs పునేరీ పల్టన్ | |
జనవరి 8 | యూపీ యోధా Vs దబాంగ్ దిల్లీ | యూ ముంబా Vs తెలుగు టైటాన్స్ | గుజరాత్ జెయింట్స్ Vs పట్నా పైరేట్స్ |
జనవరి 9 | పునేరీ పల్టన్ Vs బెంగాల్ వారియర్స్ | బెంగళూరు బుల్స్ Vs యూపీ యోధా | |
జనవరి 10 | తమిళ్ తలైవాస్ Vs హర్యానా స్టీలర్స్ | జైపూర్ పింక్ పాంథర్స్ Vs దబాంగ్ దిల్లీ | |
జనవరి 11 | పట్నా పైరేట్స్ Vs యూ ముంబా | తెలుగు టైటాన్స్ Vs గుజరాత్ జెయింట్స్ | |
జనవరి 12 | హర్యానా స్టీలర్స్ Vs యూపీ యోధా | దబాంగ్ దిల్లీ Vs బెంగళూరు బుల్స్ | |
జనవరి 13 | బెంగళూరు వారియర్స్ Vs తమిళ్ తలైవాస్ | యూ ముంబా Vs పునేరీ పల్టన్ | |
జనవరి 14 | జైపూర్ పింక్ పాంథార్స్ Vs పట్నా పైరేట్స్ | గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు బుల్స్ | |
జనవరి 15 | హర్యానా స్టీలర్స్ Vs దబాంగ్ దిల్లీ | యూపీ యోధా Vs తెలుగు టైటాన్స్ | యూ ముంబా Vs బెంగాల్ వారియర్స్ |
జనవరి 16 | తమిళ్ తలైవాస్ Vs జైపూర్ పింక్ పాంథర్స్ | పట్నా పైరేట్స్ Vs బెంగళూరు బుల్స్ | |
జనవరి 17 | పునేరీ పల్టన్ | యూపీ యోధా | తెలుగు టైటాన్స్ Vs బెంగాల్ వారియర్స్ |
జనవరి 18 | దబాంగ్ దిల్లీ Vs పట్నా పైరేట్స్ | గుజరాత్ జెయింట్స్ Vs యూ ముంబా | |
జనవరి 19 | హర్యానా స్టీలర్స్ Vs పునేరీ పల్టన్ | జైపూర్ పింక్ పాంథర్స్ Vs తెలుగు టైటాన్స్ | |
జనవరి 20 | తమిళ్ తలైవాస్ Vs గుజరాత్ జెయింట్స్ | TBC | TBC |
మ్యాచ్ 1 - రాత్రి 7.30 గంటలకు
మ్యాచ్2 - రాత్రి 8.30 గంటలకు
మ్యాచ్ 3 - రాత్రి 9.30 గంటలకు
ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ డిసెంబర్ 22న ప్రారంభం కానున్నది. అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీంతో పాటు డిస్ని + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబడుతుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kabaddi, Pro Kabaddi League, Telugu