Telugu Titans Vs Haryana Steelers : మళ్లీ నిరాశపర్చిన తెలుగు టైటాన్స్.. హర్యానాదే విక్టరీ..

Telugu Titans Vs Haryana Steelers : తెలుగు టైటాన్స్ మరోసారి నిరాశపర్చింది. హర్యానా స్టీలర్స్ తో జరిగిన మ్యాచులో 39-37 పాయింట్లతో ఓడింది తెలుగు టైటాన్స్. దీంతో, వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఫస్టాఫ్ నుంచే డిఫెన్స్ లో పదే పదే తప్పిదాలు చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంది తెలుగు టైటాన్స్. హర్యానా స్టీలర్స్ రైడర్స్ త్వరగా ట్యాకిల్ చేయాలన్న వ్యూహం బెడిసికొట్టింది ఫలితం మ్యాచ్ ను చేజార్చుకుంది తెలుగు టైటాన్స్.

  • News18 Telugu
  • | December 28, 2021, 21:36 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 8 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:42 (IST)
    21:35 (IST)

    తెలుగు టైటాన్స్ మరోసారి నిరాశపర్చింది. హర్యానా స్టీలర్స్ తో జరిగిన మ్యాచులో 39-37  పాయింట్లతో ఓడింది తెలుగు టైటాన్స్. దీంతో, వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఫస్టాఫ్ నుంచే డిఫెన్స్ లో పదే పదే తప్పిదాలు చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంది తెలుగు టైటాన్స్. హర్యానా స్టీలర్స్ రైడర్స్ త్వరగా ట్యాకిల్ చేయాలన్న వ్యూహం బెడిసికొట్టింది ఫలితం మ్యాచ్ ను చేజార్చుకుంది తెలుగు టైటాన్స్. 

    21:24 (IST)

    ప్రస్తుతం స్కోరు హర్యానా స్టీల్స్ 37, తెలుగు టైటాన్స్ 31

    21:14 (IST)

    సెకండాఫ్ లోనూ హర్యానా స్టీలర్స్ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం 34 -25 ఆధిక్యంలో ఉంది హర్యానా. 

    21:10 (IST)
    21:9 (IST)

    సెకండాఫ్ ప్రారంభంలోనే తెలుగు టైటాన్స్ ఆలౌట్ అయింది. దీంతో హర్యానా స్టీలర్స్ 30-21 తో భారీ ఆధిక్యంలో నిలిచింది. 

    21:8 (IST)

    సెకండాఫ్ లోనూ అదే తడబాటు.. తెలుగు టైటాన్స్ క్రమంగా మ్యాచ్ పై పట్టు కోల్పోతుంది. ప్రస్తుతం హర్యానా స్టీలర్స్ 20-26 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. 

    21:5 (IST)

    మరోసారి తెలుగు టైటాన్స్ లో సిద్ధార్ధ్ దేశాయ్ టాప్ పర్ ఫార్మర్ గా నిలిచాడు. 9 పాయింట్లతో సత్తా చాటాడు. 

    20:58 (IST)

    ఫస్టాఫ్ లో డిఫెన్స్ లో పదే పదే లోపాలు చేస్తూ ప్రత్యర్ధి టీమ్ కు పాయింట్లు సమర్పించుకుంది తెలుగు టైటాన్స్. దీంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి హర్యానా స్టీలర్స్ 23-19 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో త్వరగా సత్తా చాటకపోతే.. ఈ మ్యాచ్ పై తెలుగు టైటాన్స్ పట్టు కోల్పోయే ఛాన్సుంది. మరోసారి.. సిద్ధార్ద్ దేశాయ్ 9 పాయింట్లతో సత్తా చాటాడు. హర్యానా స్టీలర్స్ లో రోహిత్ గులియా ఏడు పాయింట్లతో సత్తా చాటాడు.

    20:51 (IST)

     తెలుగు టైటాన్స్ ఆలౌట్ అయింది. దీంతో 16-11 ఆధిక్యంలో నిలిచింది హర్యానా స్టీలర్స్. 

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) ఆరంభంలోనే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ ప్రో కబడ్డీ లీగ్ ఏడో రోజుకు చేరుకుంది. 8వ సీజన్ లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు తలపడనున్నాయి. ఏడో రోజు నాలుగు జట్లుబరిలోకి దిగనున్నాయి. ఇక, తెలుగు ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు తెలుగు టైటన్స్ బరిలోకి దిగనుంది. తెలుగు టైటాన్స్ పుణెరి పల్టాన్ (Telugu Titans Vs Haryana Steelers) తో తలపడనుంది. ఇప్పటికే ఒక టై, ఒక ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించింది. దీంతో, ఈ మ్యాచ్ లో నైనా బోణి కొట్టాలని తెలుగు టైటాన్స్ భావిస్తోంది.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. ఇక ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ జట్టులో ఎలానూ ఉన్నాడు. అయితే, సిద్ధార్ధ్ దేశాయ్ ఒక్కడే తెలుగు టైటాన్స్ లో రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ అందుకోవాల్సిన సమయం వచ్చింది. కీలక సమయాల్లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

    మరోవైపు, హర్యానా స్టీలర్స్ కూడా ఇంతవరుకు బోణీ కొట్టలేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో, ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో ఉంది హర్యానా స్టీలర్స్. వికాస్ కండోలా, మీతూ శర్మ, రోహిత్ గులియా వంటి స్టార్ రైడర్లు ఉన్నారు. వీరితో పాటు జై దీప్ దహియా, రవి కుమార్, సురేందర్ నాడా వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు కూడా ఉన్నారు. వీరందరూ ఫామ్ లోకి వస్తే.. హర్యానా స్టీలర్స్ ను ఆపడం కష్టమే

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా.. తెలుగు టైటాన్స్ దే పై చేయి. కానీ, హర్యానా స్టీలర్స్ కూడా తీవ్ర పోటీనిచ్చింది. తెలుగు టాటైన్స్ 3 సార్లు నెగ్గగా.. 2 సార్లు హర్యానా స్టీలర్స్ విజయ కేతనం ఎగురవేసింది.
    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : సిద్ధార్ధ్ దేశాయ్, రోహిత్ కుమార్, రజనీష్ దలాల్, సురీందర్ సింగ్, సి అరుణ్, రుతురాజ్ కొరవై, సందీప్ కొండల,

    హర్యానా స్టీలర్స్ : వికాస్ కండోలా, శ్రీకాంత్ తెవతియా, జై దీప్, మీతూ శర్మ, రోహిత్ గులియా, మోహిత్ , సురేందర్ నాడా

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    హర్యానా స్టీలర్స్ :

    రైడర్స్: మొహమ్మద్ ఇస్మాయేల్, వికాస్ చిల్లర్, వికాశ్ కండోలా, వినయ్,

    డిఫెండర్స్ : రవి కుమార్, చంద్ సింగ్, రాజేశ్ గుర్జార్, సురేందర్ నాదా,

    ఆల్‌రౌండర్స్: అజయ్, బ్రిజేందర్ చౌదరి, హమీద్ నదీర్, రాజేశ్ నర్వాల్, రోహిత్ గులియా, వికాస్ జగ్లన్