ఇక, ఫస్ట్ డే జరిగిన మూడో మ్యాచులో బెంగాల్ వారియర్స్ 38-33 తేడాతో యూపీ యోధను చిత్తు చేసింది. ఫస్టాఫ్ లో రెండు జట్లు 18-18 తో సమానంగా నిలిచినప్పటికీ.. సెకండాఫ్ లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపారు. బెంగాల్ వారియర్స్ లో ఇస్మాయిల్ నభీభక్ష్ 11 పాయింట్లతో దుమ్మురేపాడు. యూపీ యోధలో స్టార్ రైడర్ పరదీప్ నర్వాల్ కేవలం 8 పాయింట్లు మాత్రమే చేసి నిరాశపర్చాడు.
కబడ్డీ (Kabaddi).. కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. ఈ కూత వింటేనే ఒళ్లంతా పూనకం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో ఆడిన జ్ఞాపకాలు మదిలో మెదలాల్సిందే. మాయదారి రోగం కరోనా కారణంగా గతేడాది వాయిదాపడ్డ మనదైన క్రీడ ప్రో కబడ్డీ 8వ సీజన్ (Pro Kabaddi 8th Season) మళ్లీ మీ ముందుకు వచ్చేసింది. ఇక, ఫస్ట్ మ్యాచ్ లో యూ ముంబా చేతిలో 46-30 తేడాతో చిత్తుగా ఓడింది బెంగళూరు బుల్స్. ఇక తొలిరోజే తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఉండడంతో అందరూ టీవీలు, మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోయారు. అందుకు తగ్గట్టే మ్యాచ్ జరిగింది. రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడారు.
ఫస్టాఫ్ ముగిసే సమయానికి 21-23 తేడాతో తమిళ్ తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో కూడా తమిళ్ తలైవాస్ దూసుకుపోయారు. ఏకంగా 29-36 తేడాతో ఆధిక్యంలో నిలిచారు. కానీ, ఆఖరి 5 నిమిషాల్లో తెలుగు టైటాన్స్ రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ 40-40 తేడాతో టైగా ముగిసింది.