HOME »NEWS »SPORTS »priyanka chopra says she wants cricket team of kids with husband nick jonas sa

నిక్‌తో కలిసి క్రికెట్ టీం అంతా పిల్లల్ని కంటా.. ప్రెగ్నెన్సీపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు

నిక్‌తో కలిసి క్రికెట్ టీం అంతా పిల్లల్ని కంటా.. ప్రెగ్నెన్సీపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు
bollywood actors

క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు కుమార్తె జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక మరో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్ ఖాన్ కూడా త్వరలో డెలవరీ కానున్నది. అయితే ఇప్పడు అందరి దృష్టి ప్రియాంక చోప్రా వైపు మళ్ళింది.

  • Share this:

    క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు కుమార్తె జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక మరో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్ ఖాన్ కూడా త్వరలో డెలవరీ కానున్నది. అయితే ఇప్పడు అందరి దృష్టి ప్రియాంక చోప్రా వైపు మళ్ళింది. అయితే తను కూడా పిల్లలు కనడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు ప్రియాంక ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. నిక్ జోనాస్‌తో కలిసి క్రికెట్‌ టీంకు సరిపోయేంత మందిని కనాలన్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకే ఈ విషయాన్ని చెప్పారు. ఈ ముఖాముఖిలో తన వ్యక్తిగత జీవితం,ప్రెగ్నెన్సీ గురించి పూర్తి బహిరంగంగా మాట్లాడారు.



    నాకు చాలా మంది పిల్లలు కావాలి. ఒకరిద్దరూ కాదు.. క్రికెట్ జట్టుకు సరిపోయేంతా.. నాకే కాదు నిక్‌కు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య వయసు తేడా 10 ఏండ్లు.. మేము పెరిగిన వాతావరణం,నేపథ్యం వేరైనప్పటికీ అవేమి మా మధ్య అడ్డుగా ఉండలేదు. ఎలాంటి సమస్య లేకుండా హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ  ఏది ఇష్టమో, ఏది అయిష్టమో తెలుసుకుని కుటుంబంలో వచ్చే ఇబ్బందుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం" అని ప్రియాంక తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో దాంపత్య సంబంధం యొక్క కొత్త అర్ధాన్ని అర్థం చేసుకున్నానని చెప్పిన ప్రియాంక.. లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందన్నారు.

    నిశ్చితార్థం జరిగిన 5 నెలల తర్వాత ప్రియాంక, నిక్‌ 2018 లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన చిత్రం 'టెక్స్ట్ ఫర్ యు' షూటింగ్ పూర్తి చేసుకున్నది. ప్రస్తతుం 'మ్యాట్రిక్స్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరో చిత్రం ‘ది వైట్ టైగ‌ర్’ చిత్రంలో కూడా ప్రియాంక న‌టిస్తుంది.

    ఇటివలే అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపాడు. అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ సమయంలో దయ చేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోహ్లీ ఫ్యాన్స్ ను కోరాడు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న కోహ్లీ పితృత్వపు సెలవుల మీద కోహ్లీ భారత్ కు తిరిగొచ్చాడు. ఈ వార్తను కోహ్లీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. `మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ గతేడాది ఆగస్టులో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 'ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్'‌ అంటూ కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు.
    Published by:Rekulapally Saichand
    First published:January 13, 2021, 09:40 IST