Golden Duck: ఎంఎస్ ధోనీ, రాహుల్ సరసన చేరిన పృధ్వీ షా.. ఊహించని రికార్డు సొంతం.. ఫెయిలైనా ప్రమోషన్

prithvi shaw golden duck

Golden Duck: దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మరో కీలక ఆటగాడు కె.ఎల్ రాహుల్ సరసన చేరాడు యువ ఓపెనర్ పృథ్వీ షా.. తొలి టీ 20లో ఘోరంగా ఫెయిలై.. చెత్త రికార్డు సొంతం చేసుకున్న పృథ్వీ షాకు.. ప్రమోషన్ దక్కింది..

  • Share this:
    కొన్ని వద్దనుకుంటున్నా మన చెంతకు వస్తుంటాయి. భారత యవ బ్యాట్స్ మెన్.. భారత భవిష్యత్తుగా భావిస్తున్న పృధ్వీ షా ను కూడా అనుకోని ఓ రికార్డు వెంటాడింది. తన టీ20 ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే అభిమానులు తీవ్రంగా నిరాశపరిచాడు.. శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ఆడిన తొలి బంతికే డౌకౌట్‌ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. దీంతో తద్వారా గోల్డెన్‌ డకౌట్‌ అపప్రథను మూటగట్టుకున్నాడు. చమీరా వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంతికే కీపర్ క్యాచ్ తో పృథ్వీ షా ఔట్ అయ్యి వెనుతిరిగాడు. అయితే ఇలా ఆరంగ్రేట్ర మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయిన మూడో భారత ఆటగాడుగా రికార్డు నమోదు చేశాడు. ఇంతకు ముందు ఎంఎస్ ధోనీ, కెఎల్‌ రాహుల్‌ పేరుతో ఈ రికార్డు ఉండేది. వీరిద్దరూ ఆరంగ్రేట్రం టీ20 మ్యాచ్‌లో ఇలానే గోల్డెన్‌ డక్‌ అయ్యారు. వారి సరసన పృథ్వీ షా చేరాడు. అయితే ఇటీవల శ్రీలంక జట్టుతో ముగిస వన్డే సిరీస్ లో మాత్రం షా పర్వాలేదనిపించాడు. తొలి వన్డేల్లో 43 పరుగులు చేసిన షా.. తరువాత వన్డేల్లో 13 పరుగులతో నిరాశపరిచినా.. ఆఖరి వన్డేలో 49 పరుగులతో భారత పరువు కాపాడు.. కానీ తొలి టీ20లోనే తనపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు తీవ్రంగా నిరాశపరిచాడు.

    టీమిండాయా మాజీ కెప్టెన్ ధోనీ, కీలక బ్యాన్స్ మెన్ రాహుల్ కూడా ఇలా భారత జట్టు తరుపున అరంగేట్రం చేసిన మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరువ కుండానే డకౌట్ అయ్యారు. తొలి టీ 20 వరల్డ్ కప్ ద్వారా మెరిసిన ఎంస్ ధోనీ.. దక్షిణాఫ్రికా బౌలర్ చార్లెస్ కారణంగా గోల్డెన్ డక్ అయ్యాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోనీ పరుగుల ఖాతా వెరవకుండానే ఔటయ్యాడు..

    ఇదీ చదవండి: తొలి టీ20లో యంగ్ ఇండియా బోణీ.. మ్యాచ్ ను మలుపు తిప్పింది అదే..

    మరో టీమిడియా కీలక ఆటగాడు కె.ఎల్ రాహుల్ కూడా గతంలో గోల్డెన్ డక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2016లో జింబావ్వేపై కెఎల్‌ రాహుల్‌ గోల్డెన్‌ డక్‌ కాగా, ఇప్పుడు వీరిద్దరి సరసన మూడో భారత ఆటగాడిగా పృథ్వీ షా చేరాడు. ఈ మ్యాచ్ లో పృథ్వీ ఫెయిలైనా.. కెప్టెన్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లు రాణించడంతో భారత జట్టు ప్రత్యర్థి శ్రీకలం ముందు పోరాడే టార్గెట్ పెట్టగలిగింది. మరోవైపు మ్యాచ్ లో రాణించలేకపోయినా.. గత ఫాం ఆధారంగా పృథ్వీ షాకు భారత సెలక్టర్లు ప్రమోషన్ ఇచ్చారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు పృథ్వీ షా ను ఎంపిక చేశారు..
    Published by:Nagesh Paina
    First published: