• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • PRIME MINISTER NARENDRA MODI PAYS TRIBUTE TO MILKA SINGH CELEBRITIES TWEETS ABOUT MILKHA JNK

Milkha Singh : మిల్కా మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం.. తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోడీ.. ఇతర ప్రముఖుల నివాళులు

మిల్కా సింగ్ మృతిపై పలువురి సంతాపం

మిల్కా సింగ్ మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాని మోడీ నుంచి క్రీడా, రాజకీయ ప్రముఖులు ఏం ట్వీట్ చేశారో పరిశీలించండి.

  • Share this:
    దిగ్గజ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్ (Flying Sikh) మిల్కా సింగ్ (Milkha Singh) శుక్రవారం రాత్రి కన్నుమూయడంతో దేశమంతా విచారంలో మునిగిపోయింది. దేశ కీర్తి ప్రతిష్టలు తన పరుగు ద్వారా అంతర్జాతీయ వేదికల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన గొప్ప అథ్లెట్ దూరం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రాత్రి మిల్కా కొడుకు, ప్రముఖ గోల్ఫర్ జీవ్ మిల్కా ఈ విషయాన్ని ట్వీట్ చేయగానే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నుంచి క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మిల్కా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరు మిల్కా మరణానికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ అందరూ బాధలో మునిగిపోయారు. మిల్కా ఇక లేరనే వార్త విన్న వెంటనే ప్రధాని మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. 'దేశం ఒక గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. అంతర్జాతీయ వేదికపై ఆయన దేశ ఖ్యాతిని పెంపొందింప జేశారు. అనేక మంది భారతీయుల హృదయాల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయనతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను, కానీ అదే చివరి సారి అవుతుందని ఊహించలేదు. ఆయన జీవితం ఎంతో మంది క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుంది' అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన లేరనే విషయం తెలిసి మనసు బాధతో నిండిపోయిందని అన్నారు. ఆయన ఎదుర్కున్న కష్టాలు, చూపించిన తెగువ తప్పకుండా రాబోయే తరాలకు గొప్ప స్పూర్తిని ఇస్తాయని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి, ప్రముఖ వ్యాపార వేత్ ఆనంద్ మహీంద్ర, క్రీడాకారులు హర్బజన్ సింగ్, మురళి కార్తీక్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రవిశాస్త్రి, శిఖర్ ధావన్, నటులు ఫర్హాన్ అక్తర్, టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయనకు నివాళులు అర్పించాయి.































    కాగా, మిల్కాసింగ్ మృత దేహానికి శనివారం సాయంత్రం 5.00 గంటలకు చండీఘర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుండగా.. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సెక్టార్ 8లోని ఇంటి వద్ద ఉంచారు.
    Published by:John Naveen Kora
    First published: