Home /News /sports /

PRIME MINISTER NARENDRA MODI EXTENDED HIS GREETINGS ON THE NATIONS 73RD REPUBLIC DAY TO JONTY RHODES AND CHRIS GAYLE SRD

PM Narendra Modi : గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ పర్సనల్ మెసేజ్.. సర్ ప్రైజ్ అయిన క్రికెటర్లు..

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PM Narendra Modi : సౌతాఫ్రికా లెజెండ్.. గ్రేటెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ , విండీస్ దిగ్గజం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇండియాను ఈ ఇద్దరూ క్రికెటర్లు చాలా ప్రత్యేక దృష్టితో చూస్తారు.

    సౌతాఫ్రికా లెజెండ్.. గ్రేటెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ (Johnty Rhodes), విండీస్ దిగ్గజం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (Chris Gayle)కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇండియాను ఈ ఇద్దరూ క్రికెటర్లు చాలా ప్రత్యేక దృష్టితో చూస్తారు. ఐపీఎల్ ద్వారా గేల్, జాంటీ రోడ్స్ భారత క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా దగ్గరయ్యారు. దీంతో, ఈ ఇద్దరు క్రికెటర్లకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) పర్సనల్ మెసేజ్ పంపారు. ట్విట్టర్ వేదికగా ఓ లేఖను వీరిద్దరికి పంపారు మోదీ. ఈ లేఖలో ఈ క్రికెటర్లు భారతదేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు ప్రధాని. మన దేశంతో క్రికెటర్లకు ఉన్న అనుబంధాన్ని లేఖ ద్వారా తెలిపారు మోదీ. అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇదే బంధాన్ని కొనసాగించాలని క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ ను కోరారు ప్రధాని మోదీ. ఇక, ప్రధాని మోదీయే పర్సనల్ గా మెసేజ్ చేయడంతో క్రికెటర్ల ఇద్దరూ ఆనందంలో ఉబ్బితబ్బియ్యారు. ఈ బంధాన్ని భవిష్యత్తులో కూ కంటిన్యూ చేస్తామని తెలిపారు.

    ''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్‌ మెసేజ్‌తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్‌ సహా ఇతర క్లబ్‌ క్రికెట్‌లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్‌ ఫ్రమ్‌ యునివర్సల్‌ బాస్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు క్రిస్ గేల్.


    జాంటీ రోడ్స్ స్పందిస్తూ.. " భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ధన్యావాదాలు. భారత్ లో పర్యటించినప్పుడల్లా.. నేను ఓ మనిషిగా ఇంకా ఎంతో పరిణితి చెందాను.భారత రాజ్యాంగం యొక్క విలువను, దేశ ప్రజల్ని హక్కుల్ని కాపాడే గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మా కుటుంబం మొత్తం.. జరుపుకుంటున్నాం. " అంటూ ట్వీట్ చేశాడు .


    జాంటీ రోడ్స్ తన ఫీల్డింగ్‌లో చాలా కష్టపడతాడు. మైదానంలో అతని ఆటతీరు చూస్తేనే అర్థమవుతోంది. గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తుంటాడు. 10 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం నుంచి క్యాచ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కోచ్‌గా జాయిన్ అయ్యాడు. జాంటీ రోడ్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక టీంలకు కోచ్‌గా పనిచేశాడు.

    జాంటీ రోడ్స్


    ఈ సమయంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. 2015 లో అతని రెండవ భార్య మెలానియా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు నచ్చిన జాంటీ రోడ్స్.. కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టారు. అతని కుమారుడు కూడా భారతదేశంలో జన్మించడం విశేషం.

    Chris Gayle Slams West Indies Legend Player Curtly Ambrose,Curtly Ambrose News, T 20 World Cup, Cricket News, Sports News, Universal Boss Chris Gayle, Universal Boss Chris Gayle News, Chris Gayle Hitting, Kieron Pollard, Kieron Pollard Batting, క్రికెట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, క్రిస్ గేల్, క్రిస్ గేల్ ఫన్నీ వీడియో, అంబ్రోస్ పై క్రిస్ గేల్ విమర్శలు, క్రిస్ గేల్ న్యూస్, వెస్టిండీస్ న్యూస్
    క్రిస్ గేల్


    ఇక, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఆర్‌సీబీ, పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. దీనిలో ఆర్‌సీబీ తరపున 91 మ్యాచ్‌ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్‌ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్‌ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్‌లో మాత్రం గేల్‌ మెరుపులు మిస్‌ కానున్నాయి. ఐపీఎల్‌ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్‌ రిజిస్టర్‌ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్‌ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్‌ గేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chris gayle, Cricket, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు