భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి ప్రీమియర్ లీగ్, ISL మధ్య ఒప్పందం

రెండు టోర్నీల మధ్య ఆరేళ్లుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. ఒక ఈ కొత్త ఒప్పందం ప్రకారం కోచింగ్, రెఫరింగ్, భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.

news18-telugu
Updated: February 28, 2020, 9:41 PM IST
భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి ప్రీమియర్ లీగ్, ISL మధ్య ఒప్పందం
రెండు టోర్నీల మధ్య ఆరేళ్లుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. ఒక ఈ కొత్త ఒప్పందం ప్రకారం కోచింగ్, రెఫరింగ్, భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
  • Share this:
భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ ఫుట్‌బాల్‌కు లేదు. భారత్‌లో మ్యాచ్‌లు జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. కానీ ఫుట్‌బాల్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అటు భారత జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫిఫా వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేనంత దారుణ పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం ప్రీమియర్ లీగ్, హీరో ISL (ఇండియన్ సూపర్ లీగ్) మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ సమక్షంలో ప్రీమియర్ లీగ్, ISL మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది. ISL నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్ సందర్భంగా రెండు టోర్నీల నిర్వాహకులు పరస్పర సహకారం కోసం సంతకాలు చేశారు.

రెండు టోర్నీల మధ్య ఆరేళ్లుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. ఒక ఈ కొత్త ఒప్పందం ప్రకారం కోచింగ్, రెఫరింగ్, భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్ లీగ్‌తో ఒప్పందం అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో అడుగు ముందుకేసిందని అన్నారు. భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం గత ఆరేళ్లుగా చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయని.. ఈ ఒప్పందం ద్వారా మరిన్ని విజయాలు సాధిస్తామని తెలిపారు.

ప్రస్తుతం ముంబైలో నెక్ట్స్ జనరేషన్ ముంబై కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. చెల్సా, మాంచెస్టర్ యునైటెడ్, సౌతాంప్టన్ అండర్ 14 జట్లతో భారత్‌కు చెందిన బెంగళూరు, గోవా, రిలయన్స్ యంగ్ చాంప్స్ అండర్-15 మధ్య టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ ద్వారా విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఫుట్‌బాల్ ఆడడంతో పాటు విభిన్న జాతులను కలిసే అవకాశం లభిస్తోందని విదేశీ ఫుట్‌బాల్ జట్లు అభిప్రాయడుతున్నాయి. కాగా, ప్రీమియర్ లీగ్.. యూకేతో పాటు ఇతర దేశాల్లో ప్రముఖ ఫుట్‌బాల్ టోర్నీ. 188 దేశాల్లో సుమారు 100 కోట్ల మంది ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను వీక్షిస్తారు. అలాంటి టోర్నీతో ఐఎస్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భారత్‌లో ఫుట్‌బాల్ మరింత అభివృద్ధి చెందుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు