పవన్ కళ్యాణ్ (Powe Star Pawan Kalyan) మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాలు వరసగా షూటింగ్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా అన్నింటికంటే షూటింగ్ ముందుగా పూర్తి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అది గ్రాఫిక్స్ ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడుకున్న భారీ సినిమా కావడంతో కొన్ని రోజులు దాన్ని పక్కనబెట్టాడు పవన్. దానికంటే ముందు మరో సినిమాను పూర్తి చేస్తున్నాడు. అదే అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్. రానా, పవన్ హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ పాత్రలో కన్పించనున్నాడు. ఇక, పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది!. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్‌లకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు.ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగ్‌ల్లో 'గబ్బర్‌సింగ్'లోని " నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది " గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరి నోటి నుంచి సరదాగా ఈ డైలాగ్ రావాల్సిందే!
లేటెస్ట్ గా ఈ డైలాగ్‌ను దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తనదైన స్టైల్లో చెప్పి అలరించాడు. పవన్ మేనరిజంను అనుసరిస్తూ మెడపై చేతులు పెట్టుకొని సెహ్వాగ్ ఈ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మొబైల్‌లో పవన్ డైలాగ్ చెబుతున్న వీడియోను చూస్తూ.. పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్ డైలాగ్‌ను పలికిన తీరు ఇరువురు సెలబ్రిటీల అభిమానులను ఫిదా చేస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పడిదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
Sehwag Naidu mass ??? pic.twitter.com/y8fj0674sG
— Chirag Arora (@Chiru2020_) September 6, 2021
ఇక ఇంగ్లండ్‌పై నాలుగో టెస్ట్‌లో భారత్ విజయం సాధించడంపై వీరేంద్ర సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో విమర్శకుల నోళ్లు మూయించాడు. భారత్ టర్నింగ్ ట్రాక్స్‌పైనే విజయం సాధిస్తుందని చెప్పారో.. వాళ్ల ఇప్పుడు సమాధానం చెప్పాలన్నాడు.
Team India to all those who thought India is winning on Turning tracks in India and were quick to write off the team.
Respect! pic.twitter.com/fRbUqNGIaX
— Virender Sehwag (@virendersehwag) September 6, 2021
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. దేశంలో జరిగే ప్రతీ విషయంపై సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. తాజాగా సెహ్వాగ్ చేసిన పనికి టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సెహ్వాగ్ సైతం పవన్ కళ్యాణ్ సినిమాలు ఫాలోఅవుతాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : హద్దులు దాటి గ్లామర్ డోస్ పెంచిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్..
మరోవైపు, 50 ఏళ్ల తర్వాత ఓవల్ లో భారత్ కు టెస్ట్ విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక, చివరి టెస్ట్ మాంచెస్టర్ లో ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Pawan kalyan, Power star pawan kalyan, Sports, Tollywood news, Viral Video, Virender Sehwag