Home /News /sports /

POSTMASTER ARRESTED FOR BY USING FD OF 24 FAMILIES FOR IPL 2022 BETTING IN MADHYA PRADESH SRD

IPL 2022 : పోస్ట్‌మాస్టర్ లీలలు.. ఐపీఎల్ బెట్టింగ్ కోసం 24 కుటుంబాల్ని నట్టేట ముంచాడు.. రూ. కోటికి పైగా గోల్ మాల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IPL 2022 : టీవీలు, లైవ్‌ల వరకే పందాలు సాగే రోజుల నుంచి ఫోన్‌లో బాల్‌ టు బాల్‌ వరకు బెట్టింగ్‌ విస్తరించింది. ఒక ఓవర్‌కు పది పరుగులు చేస్తారా లేదా? చేస్తారని చెబితే వెయ్యి నుంచి లక్ష వరకూ పందెం కాయండి పందెం గెలవండి అంటూ అనుక్షణం కుదుట పడనీయకుండా చేసే యాప్‌ల వల్ల చాలా మంది బానిసలుగా మారుతున్నారు.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్‌ (IPL 2022) క్రికెట్‌ వేసవి సరదా అయితే.. కొంతమందికి బెట్టింగ్‌ వ్యసనంగా మారింది. సులువుగా డబ్బు సంపాదనకు ఆన్‌లైన్‌లోనే పందేలు. ఆపై అప్పులు.. ఆత్మహత్యలు.. ఇది ప్రస్తుతం యువత పరిస్థితి. ఈజీ మనీకోసం వెంపర్లాడే యువతే లక్ష్యంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో పందెం వేయాలన్నా ఆ సమయంలో పందేలకు సిద్ధంగా ఉండే యాప్‌లతో యువత బెట్టింగ్‌ వలలో చిక్కుకుపోతున్నారు. మ్యాచ్‌ జయాపజయాలే కాదు బాల్‌ బాల్‌కు.. ప్రతీ ఓవర్‌కు పరుగులు, వికెట్లు.. ఆటగాళ్ల వ్యక్తిగత స్కోరు, వికెట్లపై బెట్టింగ్‌ల జోరుగా సాగిపోతుంది. ఈ బెట్టింగ్ మాయలో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని బినా సబ్-పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన విశాల్ అహిర్వార్ ఐపీఎల్‌లో బెట్టింగ్ కోసం 24కుటుంబాల ఫిక్స్‌డ్ డిపాజిట్లను దారిమళ్లించాడు.

  ఫలితంగా రూ.కోటికి పైగా గోల్ మాల్ చేశాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ నిషేధించబడినప్పటికీ.. ఐపీఎల్ టైంలో మాత్రం జోరుగా జరుగుతుంటుంది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నష్టానికి గురైన కుటుంబాలు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ల సొమ్మును సాగర్ జిల్లా సబ్-పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలని అహిర్వార్ ను సంప్రదించగా.. అతను నకిలీ రసీదులను ఇచ్చి వారి నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యవ్వారం కొనసాగించాడు.

  అహిర్వార్ చాలా తెలివిగా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే ఖాతాదారులకు నకిలీ స్టాంప్ రసీదులను ఇచ్చి బురిడీ కొట్టించాడు. అయితే కొందరు డిపాజిటర్లు తమ డబ్బును విత్ డ్రా చేసుకోవాలని చూడగా..వారి ఫిక్స్ డ్ డిపాజిట్లు అకౌంట్లలో నమోదు కాలేదని పోస్ట్ ఆఫీస్ అధికారులు వారికి తెలియజేశారు. దీంతో అహిర్వార్ బండారం బయటపడింది. ఎట్టకేలకు అహిర్వార్ ను పోలీసులు పట్టుకుని అతనిపై సెక్షన్లు 420 (మోసం), 408 (క్రిమినల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్ట్) కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు బినా-జిఆర్‌పి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ ధుర్వే చెప్పారు.

  ఇది కూడా చదవండి :  గెలిస్తే ఫైనల్ కు.. ఓడితే ఇంటికి.. డూ ఆర్ డై ఫైట్ లో తుది జట్లు ఇవే..!

  సదరు పోస్టాఫీసు ఇన్ ఛార్జి అధికారి ధుర్వే చెప్పిన దాన్ని బట్టి బోగస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను జారీ చేస్తూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. గత రెండేళ్లలో.. అహిర్వార్ దాదాపు రూ.2కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మొత్తాన్ని ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌కు ఉపయోగించారు. అందులో రూ.కోటీ వరకు నష్టపోగా మిగతా సొమ్ము అతని వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారి మధ్యప్రదేశ్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు.

  టీవీలు, లైవ్‌ల వరకే పందాలు సాగే రోజుల నుంచి ఫోన్‌లో బాల్‌ టు బాల్‌ వరకు బెట్టింగ్‌ విస్తరించింది. ఒక ఓవర్‌కు పది పరుగులు చేస్తారా లేదా? చేస్తారని చెబితే వెయ్యి నుంచి లక్ష వరకూ పందెం కాయండి పందెం గెలవండి అంటూ అనుక్షణం కుదుట పడనీయకుండా చేసే యాప్‌ల వల్ల యువత పూర్తిగా బానిసైపోతున్నారు. ఈ తరహా యాప్‌లు రాజశ్రీ, లోటస్‌, మహదేవ్‌, భీమవరం తదితర యాప్‌లు అందుబాటులో ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అసలు పనిచేయడం మానేసి అదేపనిగా పందేలు కాసేవారు ప్రస్తుతం భారీ సంఖ్యలో ఉంటున్నారు. దీంతో.. యువతపై ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రుల్ని కోరుతున్నారు పోలీసులు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Betting, Cricket betting, Crime news, IPL 2022, Madhya pradesh, Postal Deposits

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు