Cristiano Ronaldo : ఫుట్ బాల్ స్టార్, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) కారుకు ప్రమాదం జరిగింది. స్పెయిన్ (Spain) లోన అతడి ఇంటి వద్ద అతడి లగ్జరీ కారు బుగాటి వేరాన్ స్పోర్ట్స్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు.. పొదల్లోకి దూసుకెళ్లింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో క్రిస్టియానో రొనాల్డోకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ మొదట వార్తలు వచ్చాయి. దాంతో అతడి అభిమానులు భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికే ప్రమాదం జరిగిన సమయంలో రొనాల్డో కారులో లేడని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రొనాల్డో ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : కేన్ మామపై కొరడా ఝుళిపించిన న్యూజిలాండ్.. కోహ్లీకి అదే పరిస్థితి ఎదురుకానుందా?
ప్రమాదం జరిగిన సమయంలో రొనాల్డో కారును అతడి వ్యక్తిగత సిబ్బంది నడుపుతున్నట్లు తేలింది. అతడికి స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తిపై ర్యాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారు విలువ సుమారూ రూ. 14 కోట్లు ఉంటుందని సమాచారం. రొనాల్డో కెప్టెన్ గా ఉన్న పోర్చుగల ఈ ఏడాది నవంబర్ లో ఖతర్ వేదికగా జరిగే ఫుట్ బాల్ ప్రపంచకప్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె ముగిసిన నేషన్స్ లీగ్ లో పోర్చుగల తరఫున ఆడిన రొనాల్డో అద్భుతంగా రాణించాడు.
Cristiano Ronaldo 's Bugatti Veyron suffered an accident on Monday morning in Mallorca. Apparently Cristiano was not inside the vehicle. [@UHmallorca] #mufc pic.twitter.com/WtG5crWWsd
— The United Stand (@UnitedStandMUFC) June 20, 2022
@Cristiano super-car, the #BugattiVeyron , met with a major accident. The Portuguese football superstar was not in the car at the time of the accident. The car is reportedly worth £1.7 million. pic.twitter.com/thCrVx2OOy
— Mechnotechs (@mechnotechs) June 21, 2022
రొనాల్డో ప్రస్తుతం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ఆడుతున్నాడు. వయసు మీద పడుతుండటంతో రొనాల్డో మునపటిలా ఆడలేకపోతున్నాడు. అయినప్పటికీ ఆర్జనలో మాత్రం రొనాల్డోను ఢీకొట్టే ప్లేయరే లేడు. అయితే రొనాల్డో ఇంట ఇటీవలె విషాధం నెలకొన్న సంగతి తెలిసింది. రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జియా ఇటీవెల కవలలకు జన్మనివ్వగా.. అందులో మగ శిశువు కొన్ని రోజుల తర్వాత మరణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Cristiano Ronaldo, Foot ball, Football