PORTUGAL CAPTAIN CRISTIANO RONALDO REMOVES COKE BOTTLES ASIDE SHOUTED DRINK WATER IN PRESS MEET JNK
Cristiano Ronaldo : కోక్ బాటిల్స్ పక్కకు తోసేసిన రొనాల్డో.. యూరో కప్ ప్రెస్ మీట్లో రచ్చ - Video
యూరో కప్ స్పాన్సర్ అని చూడకుండా కోకాకోలాను అవమానించాడా?
పోర్చుగల్ కెప్టెన్, దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రెస్ మీట్లో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టేబుల్ మీద ఉన్న కోక్ బాటిల్ తీసి పక్కన పడేసి.. వాటర్ తాగండి అంటూ నినదించాడు. అలా ఎందుకు చేశాడు?
యూరో కప్ 2021లో (Euro Cup 2021) భాగంగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ (Portugal), హంగేరీ (Hungary) మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి వచ్చి కూర్చున్న రొనాల్డో.. టేబుల్ మీద కోకాకోలా (Coca Cola) బాటిల్స్ ఉండటం గమనించాడు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టేశాడు. అంతే కాకుండా వాటర్ బాటిల్‌ను పట్టుకొని 'నీళ్లు తాగండి' అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఇప్పుడూ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. అయితే యూఈఎఫ్ఏ యూరో 2020కి 'కోకా కోలా' స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. అందుకే ప్రతీ ప్రెస్ మీట్లో కోక్ బాటిల్స్ కనపడేలా పెడుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో పాల్గొన్న ప్రెస్ మీట్లో కూడా నిర్వాహకులు అలగే అలంకరించారు. అయితే కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు చాలా దూరంగా ఉండే రొనాల్డో.. ఆ బాటిల్స్ చూసి ఒక్కసారిగా అసంతృప్తి చెందాడు. ఆగ్రహంతో బాటిల్స్ పక్కకు జరిపి వాటర్ తాగాలంటూ అక్కడ ఉన్న వారికి గట్టిగా అరిచి చెప్పాడు.
డైట్ విషయంలో రొనాల్డో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. గత ఏడాది 'ఈఎస్పీఎన్' రొనాల్డో తినే తిండి, నిద్రకు సంబంధించి ఒక కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారం రొనాల్డో రోజుకు 6 సార్లు భోజనం చేస్తాడు. అంతే కాకుండా రోజుకు 5 సార్లు 90 నిమిషాల చొప్పున పడుకుంటాడు. ప్రతీ రోజు ఉదయాన్నే హామ్, చీజ్‌తో పాటు యోగర్డ్ను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటాడు. ఆ తర్వాత ఆకలైతే అవకాడో టోస్ట్‌ను తింటాడు. ప్రతీ రోజు రెండు లంచ్‌లు, రెండు డిన్నర్లు చేస్తాడని ఆ కథనంలో పేర్కొన్నారు. బయట ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోడు. అంతే కాకుండా కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడు. ఆకలైతే ఫ్రూట్స్ తప్ప భారీగా భోజనం చేయడు. ప్రతీ భోజనం తర్వాత కాసేపు నడక.. ఆ తర్వాత నిద్ర.. ఇలా కఠినమైన డైట్ ఫాలో అవుతుంటాడు.
🥤👀 Cristiano Ronaldo wasn't pleased with the bottles of coke at his press conference and shouted 'drink water!'...#POR | #CR7pic.twitter.com/QwKeyKx2II
యూరో కప్ 2020లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకు ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడారు. 83 నిమిషాల పాటు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే 84వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు రాఫెల్ గురియో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత 87వ నిమిషంలో రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మళ్లీ రొనాల్డోనే ఆఖరి నిమిషంలోమరో గోల్ చేయడంతో పోర్చుగల్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి యూరో కప్ 2020ని గెలుపుతో ఆరంభించింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.