లాక్‌డౌన్ వల్ల జనాలంతా ఇళ్లకే పరిమితయ్యారు. కుటుంబంలో ఎన్ని ఫంక్షన్లు వచ్చినా వాయిదాలు వేసుకుంటున్నారు. పుట్టిన రోజును కూడా చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యులతోనే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యురాలు, బాక్సర్ మేరీ కోమ్‌కు ఢిల్లీ పోలీసులు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. గురువారం సుమారు 10 మంది పోలీసులు ఏకంగా ఇంటికి వచ్చేయడంతో.. మొదట ఆమె కంగారుపడ్డారు. ఏమై ఉంటుందని కాసేపు ఆలోచించారు. ఐతే ఆ తర్వాత.. వారు ఎందుకు వచ్చారో తెలిసి ఉబ్బితబ్బిపోయారు. ఊహించని ఈ పరిణామంతో ఎంతో సంతోషపడ్డారు. అసలేం జరిగిదంటే..
గురువారం మేరికోమ్ కుమారుడి పుట్టిన రోజు. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే ఢిల్లీ పోలీసులు వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేడం.. ఇవాళ మీ బాబు పుట్టినరోజట కదా.. విష్ చేద్దామని వారు చెప్పారు. అంతేకాదు కేక్ కట్‌చేసి బర్త్ డే వేడుకలు జరిపారు.
Delhi: Police reach the residence of boxer & Rajya Sabha MP Mary Kom with a cake to celebrate her son's birthday. #lockdown pic.twitter.com/BeVMO6ILYK
— ANI (@ANI) May 14, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.