టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. మహేంద్రుడి ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వివరాల్లోకెళితే.. రాజస్థాన్ లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధోనీ వెళ్లాడు. ఈ విషయం తెలిసి ధోనీనీ చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో వచ్చారు. ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్‌తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు.అయితే, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు.
మరోవైపు ఐపీఎల్-2021 సీజన్ కోసం చెన్నై వేదికగా ధోనీ సేన ప్రాక్టీస్ క్యాంప్ ను ఈ నెల 11 నుంచి ప్రారంభించబోతున్నట్లు సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు.ఈ ప్రాక్టీస్ సెషన్ కు కెప్టెన్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాతో పాటు కొంత మంది యువ క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉంది.
— MS Dhoni Fans Official (@msdfansofficial) March 3, 2021
ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత క్రికెటర్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటి వరకూ లీగ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.