హోమ్ /వార్తలు /క్రీడలు /

చిక్కుల్లో యువరాజ్ సింగ్.. పోలీస్ కేసు నమోదు.. రోహిత్ శర్మ కూడా..

చిక్కుల్లో యువరాజ్ సింగ్.. పోలీస్ కేసు నమోదు.. రోహిత్ శర్మ కూడా..

యువరాజ్ సింగ్ (BCCI / twitter )

యువరాజ్ సింగ్ (BCCI / twitter )

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కూడా రజత్ కల్సన్ టార్గెట్ చేశారు. యువరాజ్ అంత మాట అన్నా.. రోహిత్ ఎందుకు అడ్డు చెప్పలేదని ప్రశ్నించారు. అందుకే ఆయనపైనా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

టీమిండిమా మాజీ ఆల్‌రౌండర్ చిక్కుల్లో పడ్డారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీస్ కేసు నమోదయింది. యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల నేత కల్సన్ హర్యానాలో హిస్సార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యువరాజ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాపీలను పోలీసులకు అందజేశారు. అంతేకాదు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కూడా రజత్ కల్సన్ టార్గెట్ చేశారు. యువరాజ్ అంత మాట అన్నా.. రోహిత్ ఎందుకు అడ్డు చెప్పలేదని ప్రశ్నించారు. అందుకే ఆయనపైనా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల రోహిత్ శర్మ‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. ఆ సందర్భంగా చాహల్‌పై సరదగా కామెంట్ చేశారు యూవీ. చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని..బాంగీ మనుషుల్లా వీళ్లకు పనిపాటా లేదా? వ్యాఖ్యానించారు. ఆ మాటలకు రోహిత్మ నవ్వి ఊరుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దళితులను కించపరిచేలా యువరాజ్ మాట్లాడాడని.. నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. యువరాజ్ సింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యువరాజ్‌పై హర్యానాలో కేసు నమోదయింది.

First published:

Tags: Cricket, Rohith sharma, Sports, Yuvaraj singh

ఉత్తమ కథలు