Fifa World Cup 2022 : గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine War) దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో నిరంతరం మిస్సైల్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ కు ఆనుకుని పొలాండ్ (Poland) దేశం ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రష్యా దాడిని అడ్డుకునే ప్రయత్నంలో ఉక్రెయిన్ ప్రయోగించిన యాంటీ మిసైల్స్ పొలాండ్ లో పడిన సంగతి తెలిసిందే. దాంతో ఇద్దరు పొలాండ్ దేశీయులు మరణించారు. ఇక ఖతర్ (Qatar) వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్ కు క్వాలిఫై అయిన అన్ని జట్లు కూడా ఖతర్ కు చేరుకున్నాయి. ఇక ఈ క్రమంలో పొలాండ్ కూడా ఖతర్ కు చేరుకుంది.
ఇది కూడా చదవండి : ప్రపంచకప్ ఎఫెక్ట్.. సెలెక్షన్ కమిటీపై వేటు.. నెక్ట్స్ టార్గెట్ ఈ ప్లేయర్లేనా?
అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న పొలాండ్ దేశం తమ ఫుట్‌బాల్ టీం ఖతర్‌కు వెళ్లేప్పుడు తోడుగా రెండు జెట్ ఫైటర్స్ ను వెంట పంపింది. తమ దేశంలో మిస్సైల్స్ పడిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పొలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ కోసం బయలు దేరిన పోలాండ్ జట్టు విమానానికి ఫైటర్ జెట్-16ను ఎస్కార్ట్‌గా పంపింది. మధ్యలో విమానం వెళ్లగా.. ఇరువైపులా ఫైటర్ జెట్స్-16 ఎస్కార్ట్‌గా వెళ్లాయి.
Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! ???????? pic.twitter.com/7WLuM1QrhZ
— Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022
✈️ #KierunekKatar ???????? pic.twitter.com/1dFSxFt5ka
— Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022
ఖతర్ లో తమ దేశ ఫుట్ బాల్ జట్టు సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫైటర్ జెట్స్ పొలాండ్‌కు చేరుకున్నాయి. ఈ విషయాన్ని పొలాండ్ ఫుట్‌బాల్ టీమ్ తమ ట్విటర్లో వీడియో రూపంలో షేర్ చేసింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే ఒక జట్టు ఇలా ఎస్కార్ట్‌తో వెళ్లడం ఇదే తొలిసారి'' అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో పొలాండ్ గ్రూప్-‘సి’లో ఉంది. ఇదే గ్రూప్‌లో మెక్సికో, అర్జెంటీనా, సౌదీ అరేబియాలు కూడా ఉన్నాయి. పొలాండ్ తన తొలి పోరును నవంబర్ 23న మెక్సికోతో ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA World Cup 2022, Football, Poland, Qatar, Russia-Ukraine War