హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics: పారాలంపియన్స్‌తో కూడా భేటీకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

Paralympics: పారాలంపియన్స్‌తో కూడా భేటీకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ (File Image)

నరేంద్ర మోదీ (File Image)

Paralympics 2020: టోక్యోలో పారా ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈసారి భారతీయ ప్లేయర్లు ఇదివరకు ఎప్పుడూ లేనంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Para olympics 2020: ఈసారి పారా ఒలింపిక్స్‌ (Paralympics)లో భారత్‌కి పతకాల పంట పండుతోంది. స్వర్ణ పతకాల్ని కూడా సాధించి... ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు మన ప్లేయర్లు. ఈ సందర్భంగా... ఇదివరకు ఒలింపిక్స్ విజేతలతో ఎలాగైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం అయ్యారో... అదే విధంగా... ఈసారి పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారతీయ ప్లేయర్లతో మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ (Anurag Thakur) తెలిపారు. దీని ద్వారా ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడమే కాదు... నెక్ట్స్ ఒలింపిక్స్, ఇతర క్రీడల పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

పతకాల వేట:

ఈసారి పారా ఒలిపింక్స్‌లో విజయాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోదీ మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. తద్వారా వారి వెన్నంటే భారత్ ఉందనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈసారి పతకాల పంట పండింది. తాజాగా అది 19కి చేరింది. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్ (Suhas Yatiraj) రజత పతకం సాధించాడు. వరల్డ్ నెంబర్ 1, ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్ చేతిలో యతిరాజ్ 21-15, 17-21, 15-21 తేడాతో ఓడిపోయాడు. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. యతిరాజ్ రజతం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ట్విట్టర్ వేదికగా అభినందించారు. అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా యతిరాజ్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

paralympics 2020, krishna nagar, badminton gold, పారాలింపిక్స్, కృష్ణ నగార్, బ్యాడ్మింటన్ గోల్డ్,
పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచిన కృష్ణ నగార్ (PC: Krishna Nagar/Instagram)

స్వర్ణ సాకారం:

ఆ తర్వాత మరో బ్యాడ్మింటన్ ఆటగాడు కృష్ణ నగార్ (krishna nagar) ఫైనల్‌లో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం టోక్యోలోని యోయోగీ నేషనల్ స్టేడియంలో జరిగిన పురుషుల ఎస్‌హెచ్ 6 కేటగిరీ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో చు మన్ కాయ్‌పై 17-21, 21-16, 21-17 తేడాతో కృష్ణ నగార్ విజయం సాధించాడు. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల నగార్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు గెలిచాడు. ఈ విజయంతో పతకాల సంఖ్య 19కి చేరింది.

ఇది కూడా చదవండి: Video: పెళ్లిలో వధువుకి కోపం తెప్పించారు.. ఆమె ఏం చేసిందో తెలుసా?

పారాలింపిక్స్ నేటితో ముగియనుండగా భారతీయ ప్లేయర్లు అద్భుత ప్రతిభ చూపించడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విజయాలు ఎంతో మందికి ప్రేరణ ఇస్తున్నాయని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

First published:

Tags: Modi, PM Narendra Modi, Tokyo, Tokyo Olympics

ఉత్తమ కథలు