థామస్ కప్ టీమ్ సభ్యుడు లక్ష్యసేన్ ను అభినందిస్తున్న ప్రధాని మోదీ (PC : TWITTER)
Thomas Cup : బ్యాడ్మింటన్ (Badminton) లో భారత స్టార్ ప్లేయర్స్ దూసుకెళ్తున్నా.. థామస్ కప్ (Thomas cup)లో మాత్రం చతికిల పడుతున్నారు. అయితే ఈ నెలలో జరిగిన థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ (Badminton) జట్టు కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Thomas Cup : బ్యాడ్మింటన్ (Badminton) లో భారత స్టార్ ప్లేయర్స్ దూసుకెళ్తున్నా.. థామస్ కప్ (Thomas cup)లో మాత్రం చతికిల పడుతున్నారు. అయితే ఈ నెలలో జరిగిన థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ (Badminton) జట్టు కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకొని ఔరా అనిపించుకుంది. బ్యాంకాక్ (bangkok) వేదికగా జరిగిన ఈ టోర్నీలో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, హెచ్ ఎస్ ప్రణయ్, ధ్రువ్ కపిల, అర్జున్ లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 3-0తో డిఫెండింగ్ చాంపియన్, 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాపై ఘనవిజయం సాధించి తొలిసారి థామస్ కప్ ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ జట్టుకు దేశంలో ఎక్కడ చూసినా నీరాజనాలు అందుతున్నాయి. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం వీరిని అభినందించారు. ఆదివారం భారత చాంపియన్ టీం మోదీని కలిసింది. టోర్నీలో తాము ఎలా ఆడామో.. పటిష్ట జట్టు అయిన ఇండోనేసియాను ఏ విధంగా మట్టికరిపించామో తదిర అంశాలను మోదీకి వివరించింది. దీనిపై ప్రధాన మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి.. దానికి వీడియోను జత చేశారు. ’బ్యాడ్మింటన్ చాంపియన్స్ తో ముచ్చటించడం గౌరవంగా అనిపించింది. టోర్నీ జరిగిన విధానం అందులో మన ప్లేయర్స్ ఏ విధంగా ఆడారు. అలాగే ఆటతో పాటు ఇతర విషయాలపై చర్చించాం. వారి ఘనత పట్ల దేశం యావత్తూ ఉప్పొంగిపోతుంది‘ అంటూ ట్వీట్ కు కామెంట్స్ జత చేశారు.
Interacted with our badminton champions, who shared their experiences from the Thomas Cup and Uber Cup. The players talked about different aspects of their game, life beyond badminton and more. India is proud of their accomplishments. https://t.co/sz1FrRTub8
గత ఆదివారం బెస్ట్ ఆఫ్ ఫైఫ్ మ్యాచెస్ పద్ధతిన జరిగిన ఫైనల్లో.. 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను భారత్ వరుస మ్యాచ్ ల్లో మట్టికరిపించింది. తొలుత జరిగిన సింగిల్స్ లో బరిలోకి దిగిన లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనిపై పోరాడి గెలిచాడు. తొలి గేమ్ లో ఓడిపోయిన లక్ష్యసేన్.. ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లోనూ నెగ్గి మ్యాచ్ నెగ్గాడు. ఫలితంగా భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం జరిగిన డబుల్స్ లో బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట 18-21, 23-21, 21-19తో మొహమ్మద్-కెవిన్ సంజయ ద్వయంపై గెలిచింది. దాంతో భారత జట్టు ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఇక మూడో మ్యాచ్ లో బరిలోకి దిగిన కిడాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాథన్ క్రిస్టీ పై వరుస గేముల్లో నెగ్గి భారత్ కు థామస్ కప్ ను అందించాడు. మహిళల విభాగంలో జరిగే ఉబెర్ కప్ లో భారత మహిళల జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరలేకపోయింది. అయితే పురుషుల జట్టు మాత్రం అద్భుత ఆటతీరుతో చాంపియన్ గా నిలిచింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.