Home /News /sports /

PLUMBER BABLU FROM BIHAR BECAME MILLIONAIRE AFTER WINNING ONE CRORE RUPEES IN DREAM 11 FANTASY IN IPL 2021 SK

IPL 2021: ఈ పేదోడు ఇప్పుడు కోటీశ్వరుడు.. రూ.59తో కోటి గెలిచాడు.. అంతా ఐపీఎల్ మహిమ

బబ్లూ మండల్ ఫ్యామిలీ

బబ్లూ మండల్ ఫ్యామిలీ

IPL 2021: కొద్దిరోజుల కిందట ఇదే బీహార్‌లోని మధుబనీకి చెందిన అశోక్​ కుమార్​కు కూడా జాక్‌పాట్ తగిలింది. బబ్లూ లాగే ఆయన సైతం కోటి రూపాయలు గెలిచారు. చిన్న సెలూన్​ షాప్​ నడిపే ఆయనకు డ్రీమ్ 11 యాప్ ద్వారా రూ. కోటి రూపాయలు సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  అతడిది నిరుపేద కుటుంబం. ఇల్లు  కూడా సరిగా లేదు. రోజూ కూలీకి వెళ్తే గానీ కుటుంబం గడవదు. అలాంటిది రాత్రికి రాత్రే  అతడు కోటీశ్వరుడు అయ్యాడు. ధనలక్ష్మీ తలుపు తట్టి మరీ కోట్లు కుమ్మరించింది. ఐపీఎల్ (IPL 2021) పుణ్యానా అతడిపై కాసుల వర్షం కురిసింది. డ్రీమ్ 11 (Dream 11) యాప్‌లో ఫాంటసీ గేమ్ పాల్గొని కోటీ రూపాయలు గెల్చుకున్నాడు. బీహార్‌ (Bihar)లోని కటిహార్ జిల్లా హంస్‌వర్ గ్రామానికి చెందిన బబ్లూ మండల్.. వృత్తి రీత్యా ప్లంబర్. ప్లంబింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐతే బబ్లూకు తనతో పనిచేసే మరో వ్యక్తి ద్వారా డ్రీమ్ 11 గురించి తెలిసింది. అనంతరం అతడు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫాలో అవుతూ డ్రీమ్ 11 యాప్‌లో బెట్టింగ్ పెడుతున్నారు. చిన్న చిన్నమొత్తంతోనే ఫాంటసీ క్రికెట్ గేమ్‌లో పాల్గొనేవారు. ఒకసారి 49 రూపాయలతో పాల్గొంటే 200 గెలిచారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ డబ్బులు రాలేదు. ఐనా అతడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ఎప్పటిలానే అక్టోబరు 10న.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)మ్యాచ్‌పై బెట్టింగ్ పెట్టారు.

  Team India New Jersey : టీమిండియా జెర్సీపై మూడు చుక్కలు.. వాటికి అర్థమెంటో తెలుసా..?

  కేవలం రూ.59తో కోటి రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు బబ్లూ. ఆ రోజు అనూహ్యంగా అతడే విజేతగా నిలిచాడు. కోటి రూపాయల కాంటెస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. కోటి రూపాయలు గెలిచినట్లు ఆ మరుసటి రోజు ఉదయం డ్రీమ్ 11 నుంచి సందేశం వచ్చింది. ఆ మెసేజ్‌ను చూసి బబ్లూ ఆనందం పట్టలేకపోయారు. డ్రీమ్​ 11 బృందం కూడా తనకు ఫోన్ చేసిన అభినందనలు తెలిపిందని పేర్కొన్నారు బబ్లూ.

  '' నాతో పని చేసే వ్యక్తి డ్రీమ్​ 11 గురించి చెప్పాడు. అప్పటివరకు నాకు దాని గురించి అసలేం తెలియదు. నా ఫోన్​లో ఆ వ్యక్తే డ్రీమ్ 11 యాప్​ ఇన్​స్టాల్​ చేశాడు. కొద్దిరోజుల క్రితమే నేను దానిని వాడుతున్నా. మొదట 200 గెలిచాను. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు వచ్చాయి. రూ. 30 లక్షలు పన్ను రూపంలో తీసుకున్నారు. నా ఖాతాలోకి 70 లక్షలు జమయ్యాయి. ఆ డబ్బుతో మొదట మంచి ఇల్లు కట్టుకుంటా. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. మరికొంత డబ్బును స్థానిక దేవాలయానికి విరాళం ఇస్తా. అని బబ్లూ మండల్ తెలిపారు.

  IPL 2021: సాధారణ బార్బర్‌కు ఊహించని జాక్‌పాట్.. ఐపీఎల్ పుణ్యాన రాత్రికి రాత్రే కోటీశ్వరుడు

  కొద్దిరోజుల కిందట ఇదే బీహార్‌లోని మధుబనీకి చెందిన అశోక్​ కుమార్​కు కూడా జాక్‌పాట్ తగిలింది. బబ్లూ లాగే ఆయన సైతం కోటి రూపాయలు గెలిచారు. చిన్న సెలూన్​ షాప్​ నడిపే ఆయనకు డ్రీమ్ 11 యాప్ ద్వారా రూ. కోటి రూపాయలు సొంతం చేసుకున్నారు. కేవలం రూ.49తో బెట్టింగ్ పెట్టి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.

  Viral Video : వామ్మో.. బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. హోటల్ రూంలో భార్య సంజనాతో సరసాలు..

  కాగా, డ్రీమ్ 11లో ఇవాళ మ్యాచ్ జరిగే జట్ల నుంచి ప్లేయర్స్‌ను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును తయారు చేసుకుంటారు. మ్యాచ్‌లో ఆయా ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఆ కంటెస్ట్‌లో విజయం సాధించిన వారు డబ్బులు గెలుచుకోవచ్చు. ఇందులో ఎన్నో రకాల కంటెస్ట్‌లు ఉంటాయి. ఔత్సాహికులు డబ్బులు చెల్లించి తమకు నచ్చిన కంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో చాలా మంది యువత పలు పెయిడ్ కంటెస్ట్‌లలో డబ్బులు పెట్టి ఫాంటసీ క్రికెట్ ఆడుతున్నారు. ఐతే డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌పై ఏపీ, తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో నిషేధం అమల్లో ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు