హోమ్ /వార్తలు /క్రీడలు /

Sonusood : కేన్ మామను పెవిలియ‌న్‌కు పంప‌వా? సోనూకి ఫ్యాన్ వింత రిక్వెస్ట్..రియల్ హీరో రిప్లై ఇదే..

Sonusood : కేన్ మామను పెవిలియ‌న్‌కు పంప‌వా? సోనూకి ఫ్యాన్ వింత రిక్వెస్ట్..రియల్ హీరో రిప్లై ఇదే..

ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న రియల్ హీరో సోనూ సూద్ ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. నిజంగా అవసరం ఉన్నవారికి, ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తూ.. వింత కోరికలు కోరే వారికి ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్న  సోనూ సూద్ తాజా వీడియో వైరల్ మారింది.

ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న రియల్ హీరో సోనూ సూద్ ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. నిజంగా అవసరం ఉన్నవారికి, ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తూ.. వింత కోరికలు కోరే వారికి ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్న సోనూ సూద్ తాజా వీడియో వైరల్ మారింది.

Sonusood : కరోనా కాలంలో రియల్ హీరోగా మారాడు సోనూ సూద్. కష్టకాలంలో ఎలాగైనా సోనూ ఆదుకుంటాడన్న భావన ప్రజల్లో ఉంది. అయితే, ఆయన దృష్టికి ఓ క్రికెట్ అభిమాని ఓ విచిత్రమైన కోరికను ముందుకు తెచ్చాడు.

కోవిడ్ క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుని నిజ‌మైన హీరోగా గుర్తింపు పొందాడు నటుడు సోనూసూద్. సోనూసూద్‌కు మొర‌పెట్ట‌కుంటే చాలు ఏక‌ష్ట‌మైనా ఇట్టే తీరిపోతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తుంటారు. దీనికి కార‌ణం ఎవ‌రు ఏది అడిగినా కాద‌న‌కుండా సోనూసూద్ సాయం చేస్తుండ‌ట‌మే. అందుకే దేశ‌వ్యాప్తంగా ఆయన ఆరాధ్య‌ దైవంగా మారాడు. ఈయ‌న స్ఫూర్తితో చాలామంది తాము కూడా స‌మాజానికి ఏదైనా చేయాల‌ని ఆరాప‌డుతున్నారు. ఇప్ప‌టికే సోనూసూద్ ఓ చారిట‌బుల్ ట్ర‌స్టు ఏర్పాటు చేసి దేశం న‌లుమూల‌లా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రిస్తున్నాడు. ఆయ‌న దృష్టికి ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందంటే వెంట‌నే దానిని ప‌రిష్క‌రించేవ‌ర‌కు నిద్ర‌పోడు. అందుకే ఓ క్రికెట్ అభిమాని సోనూసూద్‌ను ఓ విచిత్ర‌మైన కోరిక కోర‌డం, కొద్దిసేప‌టికి ఆ కోరిక తీర‌డం వైరల్‌గా మారింది. అయితే అతడి కోరిక నెరవేరడానికి సోనూసూద్ కార‌ణం కాక‌పోవడం విశేషం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...

ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ పోరులో త‌ల‌ప‌డుతున్న భార‌త న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య ఆట ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగింది. ఐదోరోజు ఆట‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ‌టమే కాదు, త‌న ఆట‌తీరుతో జట్టును స్వ‌ల్ప ఆధిక్యంలోనూ నిలిపారు. 177 బంతులు ఆడిన విలియ‌మ్స‌న్ 49 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఇండియ‌న్ ఫాన్స్‌కు విలియ‌మ్స‌న్ ఆట‌తీరు అస‌హ‌నానికి గురిచేసింది. ఈ జిడ్డు ఆట ఎప్ప‌డు పోతుందారా బావు, ఇత‌గాడు ఎప్ప‌డు పెవిలియ‌న్ చేర‌తాడా అని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. అయితే సాగ‌ర్ అనే ఓ అభిమాని కేన్ విలియ‌మ్స‌న్‌ను కొంచెం పెవిలియ‌న్‌కు పంపండి అంటూ సోనూసూద్‌కు ట్వీట్ చేయ‌డం ఆసక్తిగా మారింది.

కోవిడ్ లాక్‌డౌన్ పిరియ‌డ్‌లో కొన్నివేల‌మందిని సొంత గ్రామాల‌కు పంప‌డంలో సోనూసూద్ సాయ‌ప‌డిన విష‌యం తెలిపిందే. మ‌రి భార‌త విజ‌యానికి అడ్డుగోడ‌లా నిల‌బ‌డిన విలియ‌మ్స‌న్‌ను కూడా అదే త‌ర‌హాలో పెవిలియ‌న్‌కు పంప‌గ‌ల‌డ‌ని భావించాడేమో గానీ సాగ‌ర్ అనే నెటిజ‌న్ సోనూసూద్‌కు ట్వీట్ చేశాడు. ‘హ‌లో సోనూసూద్.. ద‌య‌చేసి విలియ‌మ్స‌న్ ను పెవిలియ‌న్‌కు పంపండి’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేప‌టికే విలియ‌మ్స‌న్ అవుట్ అయ్యాడు. త‌రువాత సోనూసూద్ లైన్‌లోకి వ‌చ్చి ఈ ట్వీట్‌కు స‌మాధానంగా మ‌న టీమ్‌లో దిగ్గ‌జ ఆట‌గాళ్లున్నారు.. వాళ్ళే అత‌నిని వెన‌క్కు పంపుతారు... చూడు విలియ‌మ్స‌న్ అవుటైపోయాడు అంటూ ట్వీట్ చేశాడు. నిజంగానే సోనూసూద్‌ను ఏదైనా కోరుకుంటే అది జ‌రిగిపోతుందేమో క‌దా...

Published by:Sridhar Reddy
First published:

Tags: India vs newzealand, Kane Williamson, Sonusood, WTC Final

ఉత్తమ కథలు