హోమ్ /వార్తలు /క్రీడలు /

వివాదంలో గంగూలీ కూతురు.. బీసీసీఐ బాస్ రియాక్షన్ ఇదే..

వివాదంలో గంగూలీ కూతురు.. బీసీసీఐ బాస్ రియాక్షన్ ఇదే..

సౌరభ్ గంగూలీ, సనా గంగూలీ

సౌరభ్ గంగూలీ, సనా గంగూలీ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వివాదంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా ఇరుక్కుంది. సీఏఏకు వ్యతిరేకంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారని ప్రచారం జరిగింది.

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వివాదంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా ఇరుక్కుంది. సీఏఏకు వ్యతిరేకంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారని ప్రచారం జరిగింది. కుశ్వంత్‌ సింగ్‌ రాసిన 'ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా' పుస్తకంలోని సందేశాన్ని సనా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌పై ఆమెను కొందరు ప్రశంసించగా, ట్రోల్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో గంగూలీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. సనాను ఇలాంటి పోస్టుల నుంచి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశాడు. ఆ పోస్ట్ నిజం కాదని, రాజకీయాల గురించి ఆమెకు అంతగా తెలీదని, వాటి గురించి తెలుసుకునేంత వయసు ఆమెది కాదని విన్నవించాడు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Bcci, Citizenship Amendment Act, Instagram, Sourav Ganguly

    ఉత్తమ కథలు