Home /News /sports /

PLAYERS UNAVAILABLE FOR IPL 2021 2ND PHASE CHECK TEAM WISE PLAYERS ABSENT FOR 2ND PHASE JNK

IPL 2021: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌‌కు డుమ్మా కొడుతున్న ఆటగాళ్లు వీళ్లే.. ఆ ఫ్రాంచైజీలకు కష్టాలు తప్పవా?

ఐపీఎల్ 2వ దశకు అందుబాటులో ఉండని ఆటగాళ్లు వీళ్లే (PC: IPL)

ఐపీఎల్ 2వ దశకు అందుబాటులో ఉండని ఆటగాళ్లు వీళ్లే (PC: IPL)

IPL 2021: ఐపీఎల్ 2021 రెండవ దశ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నది. కాగా, రెండో దశకు చాలా మంది విదేశీ ప్లేయర్లు గైర్హాజరవుతున్నారు. ఏయే ఫ్రాంచైజీలో ఎవరెవరు రావడం లేదో ఒక సారి పరిశీలిద్దాం.

  ఐపీఎల్ 2021 (IPL 2021) సెకెండ్ ఫేజ్ ప్రారంభం కావడానికి మరో 9 రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీల్లో అందుబాటులో ఉన్న ఆటగాళ్లు యూఏఈ (UAE) చేరుకొని సాధన మొదలు పెట్టారు. తొలి దశలో 29 మ్యాచ్‌ల అనంతరం కోవిడ్ (Covid) కలకలం రేగడంతో ఈ ఏడాది మే 4న ఐపీఎల్ 2021ని బీసీసీఐ (BCCI) అర్దాంతరంగా వాయిదా వేసింది. అనేక మంతనాలు, తర్జనభర్జనల అనంతరం యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశతో పాటు టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కూడా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 19న రెండో దశ ఐపీఎల్ జరుగనున్నది. అయితే కోవిడ్ ఆందోళనలు, ఇతర జట్లతో ద్వైపాక్షిక మ్యాచ్‌లు, గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు రెండో దశకు దూరమవుతున్నారు. వీరందరూ విదేశీ క్రికెటర్లే కావడం గమనార్హం. ఆయా ఫ్రాంచైజీల్లో కీలకమైన క్రికెటర్లు కావడంతో జట్లు కూడా ఆందోళన చెందుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు రిప్లేస్‌మెంట్ చేసుకున్నాయి. అయినా వీరి గైర్హాజరీ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది.

  1. పంజాబ్ కింగ్స్ (Punjab Kings):


  పంజాబ్ కింగ్స్ జట్టులో ఇద్దరు బౌలర్లు రెండో దశకు అందుబాటులో ఉండటం లేదు. ఆస్ట్రేలియాకు చెందిన రిలే మెరిడిత్, జే రిచర్డ్‌సన్ జట్టుతో చేరడం లేదని కబురు పంపారు. వీరిద్దరూ ఈ ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడం గమనార్హం. రిలే మెరిడిత్ 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీశాడు. వీరి గైర్హాజరీలో పంజాబ్ కింగ్స్ షమీకి పేసింగ్ జోడీని నిర్ణయించాల్సి ఉన్నది.

  2. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals):

  రాజస్థాన్ రాయల్స్ జట్టు జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై సేవలను కోల్పోనున్నది. ఇంగ్లాండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయాలు, ఇతర కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. ఇక ఆండ్రూ టై కోవిడ్ నేపథ్యంలో తాను రెండో దశకు రాలేనని చెప్పాడు. జాస్ బట్లర్ కూడా ఆడేది అనుమానమే. కీలకమైన ఆటగాళ్లు దూరమవడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది.

  3. కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders):

  ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ రెండో దశ ఐపీఎల్ ఆడటం లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో కలవబోవడం లేదని అతడు సమాచారం పంపాడు. ఈ ఏడాది 7 మ్యాచ్‌లు ఆడిన కమిన్స్.. కేవలం బంతితో మాత్రమే కాకుండా బ్యాటుతో కూడా రాణించాడు. చెన్నైపై 66 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

  4. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad):

  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకమైన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఐపీఎల్ 2వ దశకు అందుబాటులో ఉంటారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ వాళ్లు ఐపీఎల్ ఆడేందుకు వస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ జట్టు ఊపిరి పీల్చుకున్నది. అయితే మిచెల్ మార్ష్ ఈ సారి కూడా అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో ఇప్పటికే జేసన్ రాయ్‌ను తీసుకున్నారు. తొలి దశలో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

  5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru):

  ఐపీఎల్ 2021 రెండవ దశలో అందరి కంటే ఎక్కువ నష్టపోతున్నది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఫిన్ అలెన్, స్కాట్ కుగ్లీన్, జోష్ ఫిలిప్, అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ రెండో దశకు అందుబాటులో ఉండమని చెప్పేశారు. వీరి స్థానంలో శ్రీలంకకు చెందిన క్రికెటర్లను ఆర్సీబీ తీసుకున్నది. అయితే కొత్తగా జట్టుతో చేరే ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది చూడాల్సి ఉన్నది.

  INDvsENG: ఐదో టెస్టుపై మెలిక పెట్టిన ఈసీబీ.. మీ పప్పులు ఉడకవంటూ బీసీసీఐ.. ఇరు బోర్డుల మధ్య వివాదం   ఇక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని విదేశీ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండనున్నారు. టాప్ 4లో ఈ మూడు జట్లు ఉండటంతో వీరికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికే ఈ మూడు జట్ల క్రికెటర్లు యూఏఈ వెళ్లి ప్రాక్టీస్ ప్రారంభించారు.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Bcci, IPL, IPL 2021

  తదుపరి వార్తలు