• Home
 • »
 • News
 • »
 • sports
 • »
 • PLAN B FOR REST OF THE IPL SEASON BCCI LIKELY TO SHIFT ENTIRE IPL TO MUMBAI JNK

IPL 2021: ప్లాన్ బీ.. ఐపీఎల్ కొనసాగించేందుకు బీసీసీఐ కొత్త వ్యూహం.. వెనకడుగు వేసే ఛాన్సే లేదు.

ఐపీఎల్ మిగిలిన సీజన్ నిర్వహణకు ప్లాన్ బీ రూపొందించిన బీసీసీఐ

ఐపీఎల్ 2021కు కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో సోమవారం బెంగళూరు-కోల్‌కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఐపీఎల్ షెడ్యూల్ డిస్ట్రబ్ అవడంతో ఇకపై మొత్తం లీగ్‌ను ఒకే వేదికలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది.

 • Share this:
  ఐపీఎల్ 2021కి (IPL 2021) కరోనా (Covid-19) దెబ్బ తగిలింది. లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని (Kolkata Knight Riders) ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కూడా కరోనా కలకలం రేగడం.. ఢిల్లీ మైదాన సిబ్బంది పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సోమవారం అహ్మదాబాద్‌లో జరగాల్సిన కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌ను కూడా వాయిదా వేశారు. దీంతో బీసీసీఐ (BCCI)'ప్లాన్ బీ' (Plan B) అమలు చేయడానికి రెడీ అయ్యింది. ఇక మిగిలిన లీగ్ మొత్తం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ వారం చివరిలో ఐపీఎల్ మొత్తాన్ని ముంబైకి తరలించనున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసి.. మిగిలిన మ్యాచ్‌లన్నీ ముంబై వాంఖడేలో నిర్వహించడానికి బీసీసీఐ సిద్దపడుతున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా షెడ్యూల్‌లో కూడా మార్పులు చేయనున్నారని.. ఫైనల్ మే 30న కాకుండా జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వెబ్‌సైట్ 'క్రిక్ ఇన్ఫో' ఒక కథనం వెలువరించింది. ముంబైలో అతిపెద్ద బయోబబుల్ క్రియేట్ చేసి అన్ని మ్యాచ్‌లను అక్కడే ఆడించనున్నారు. మరోవైపు ఎనిమిది జట్లకోసం హోటల్ రూమ్‌లు వెతికే పనిలో పడ్డారు. మ్యాచ్‌లను కేవలం వాంఖడేకు మాత్రమే పరిమితం చేయకుండా బ్రబౌర్న, డీవై పాటిల్ స్టేడియంలను కూడా ఐపీఎల్ కోసం వినియోగించుకునేందకు బీసీసీఐ రెడీ అవుతున్నది.

  ఈ సీజన్‌లో జరిగిన తొలి విడత మ్యాచ్‌లను ముంబైలో విజయవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆయా జట్ల ప్రాక్టీస్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌తో పాటు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ను వినియోగించారు. ముంబైలో అతిపెద్ద స్టార్ హోటల్స్ అందుబాటులో ఉండటంతో అక్కడ బయోబబుల్ ఏర్పాటుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో కరోనా కేసులు భారీగా ఉన్నా.. ముంబైలో పలు ఆంక్షల కారణంగా కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ముంబై బెస్ట్ చాయిస్ అని బోర్డు భావిస్తున్నది. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా ఈ సమయంలో వెనకడుగు వేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించాలని కోరుతున్నాయి.

  కరోనా కారణంగా మ్యాచ్ వాయిదా పడటంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముంబైకి ఐపీఎల్ తరలించిన తర్వాత మరిన్ని డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా ఐపీఎల్ ఫైనల్ మే 30న కాకుండా జూన్ మొదటి వారానికి మర్చే అవకాశం ఉన్నది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు జూన్ మొదటి వారం చివరిలో ఇంగ్లాండ్ ప్రయాణించాల్సి ఉంది. అంతే కాకుండా పలువురు విదేశీ ఆటగాళ్లు తమ జాతీయ జట్ల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సి ఉన్నది. అందుకే సాధ్యమైనంత త్వరగా జూన్ మొదటి వారంలోనే ఐపీఎల్ ముగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాయి. ఈ వారాంతానికి ఈ ఐసోలేషన్ ముగియనుండటంతో.. మిగిలిన లీగ్ మొత్తం ముంబైకి తరలించి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
  Published by:John Naveen Kora
  First published: