PKL 8 TELUGU TITANS FIGHT BACK TO EARN 40 40 TIE AGAINST TAMIL THALAIVAS JNK
PKL 2021-22: తెలుగు టైటాన్స్ - తమిళ్ తలైవాస్ మధ్య ఉత్కంఠ పోరు.. నువ్వా నేనా అంటు తలపడిన మ్యాచ్ టై
తెలుగు టైటాన్స్ - తమిళ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ టై
PKL 8: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8లో భాగంగా తొలి రోజు తెలుగు టైటాన్స్ - తమిళ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో 4 సార్లు టై ఫలితమే వచ్చింది.
ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 8వ సీజన్లో (Season 8) జరిగిన రెండో మ్యాచ్ టాలీవుడ్ సినిమా కంటే తక్కువేమీ కాదు. సీజన్‌లోని రెండవ మ్యాచ్ తెలుగు టైటన్స్ (Telugu Titans) - తమిళ తలైవాస్ (Tamil Talaivas) మధ్య జరిగింది. ఎంతో యాక్షన్-డ్రామాతో కూడిన ఈ మ్యాచ్ చూసిన ఏ అభిమాని అయినా ఆశ్చర్యపోతాడు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని షెరటన్ గ్రాండ్లో జరిగిన మ్యాచ్ 40-40తో టైగా ముగిసింది. ఒకానొక సమయంలో తమిళ్ తలైవాస్ 9 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చినా టైటాన్స్ కూడా పట్టు వదలకుండా తిరిగి అత్యుత్తమ రీతిలో పుంజుకుని మ్యాచ్‌ను సమం చేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లోని ఈ మ్యాచ్‌లో తలైవాస్ తరఫున రైడర్ మంజీత్ అత్యధికంగా 12 పాయింట్లు సాధించగా, రైడర్ ప్రపంజన్ 6 పాయింట్లు జోడించాడు. తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ సిద్ధార్థ్ దేశాయ్ 11, రజనీష్ 6 పాయింట్లు సాధించారు. లీగ్ చరిత్రలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ నాలుగోసారి టై అయింది. ఇరు జట్లు ఇంతకు ముందు 8 మ్యాచ్‌లు ఆడగా, అందులో 3 డ్రా అయ్యాయి.
ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తొలి అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు సాధించగా, తమిళ్ తలైవాస్ 23 పాయింట్లు సాధించింది. మొదటి అర్ధభాగంలో టైటాన్స్ రైడ్స్ ద్వారా 13, ట్యాకిల్స్ ద్వారా 6 మరియు 2 ఆల్ అవుట్ పాయింట్లను సాధించింది. అదే సమయంలో తలైవాస్‌కు రైడ్‌లో 14, ట్యాకిల్‌లో 7 మరియు 2 ఆల్ అవుట్ పాయింట్లు వచ్చాయి.
ఒక దశలో టైటాన్స్ 9 పాయింట్లతో వెనుకబడి ఉంది. అయితే ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈ మ్యాచ్‌పై వారు పట్టు చేజారి మ్యాచ్ నుంచి బయటపడినట్లు అనిపించింది. కానీ తమిళ్ తలైవాస్ వదిలిపెట్టలేదు. సెకండాఫ్‌లోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తమిళ్ తలైవాస్ మొత్తం 17 పాయింట్లు సాధించింది. అందులో 7 రైడ్ల నుండి మరియు 7 ట్యాకిల్స్ ద్వారా వచ్చాయి. ఇది కాకుండా 2 ఆల్ అవుట్ పాయింట్లు సాధించింది. అదే సమయంలో సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ రైడ్ల ద్వారా 12 పాయింట్లు, ట్యాకిల్స్‌తో 7 పాయింట్లు జోడించింది. ఆలౌట్‌గా 2 పాయింట్లు కూడా సాధించాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.