హోమ్ /వార్తలు /క్రీడలు /

PKL 8 : అచ్చం.. ఐపీఎల్ లో ఆ రెండు జట్లను గుర్తుకుతెస్తోన్న టైటాన్స్.. పదోసారి ఓటమి..!

PKL 8 : అచ్చం.. ఐపీఎల్ లో ఆ రెండు జట్లను గుర్తుకుతెస్తోన్న టైటాన్స్.. పదోసారి ఓటమి..!

Telugu Titans vs Bengaluru Bulls

Telugu Titans vs Bengaluru Bulls

PKL 8 : ప్రొకబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్ లో ఆడిన 13 మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే దక్కించుకుంది.

ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌ (Telugu Titans)కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ దరిద్రం టైటాన్స్ కు పట్టుకున్నట్టుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్.. 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు టైటాన్స్ ది కూడా అదే పరిస్థితి.

ప్రొకబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31-36తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టీమ్‌లో అంకిత్(7), రాకేశ్ గౌడ(5), ఆకాశ్(5) రాణించినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ పవన్ షెరావత్(12 పాయింట్లు) మరో సూపర్ 10తో బెంగళూరు బుల్స్‌ను గెలిపించాడు. ఆరంభం నుంచే బెంగళూరు బుల్స్ ఆధిపత్యం చెలాయించింది.

సూపర్ రైడింగ్‌తో పాటు అద్భుత ట్యాకిల్స్‌తో తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి ఫస్టాఫ్‌లొ 22-11 తేడాతో డబుల్ లీడ్ సాధించింది. సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నా.. విజయాన్ని అందుకోలేకపోయింది. ట్యాకిలింగ్‌లో సత్తా చాటిన తెలుగు టైటాన్స్‌ బెంగళూరు ఓసారి ఆలౌట్ చేసి సెకండాఫ్‌లో 20 పాయింట్లు సాధించింది.

మరోవైపు బెంగళూరు 14 పాయింట్లే సాధించినా.. ఫస్టాఫ్ లీడ్ ఆ జట్టు విజయానికి కలిసొచ్చింది. దీంతో, ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. దీంతో, ఫ్యాన్స్ తెలుగు టైటాన్స్ పై ఫైరవుతున్నారు. అచ్చం సన్ రైజర్స్ టీమ్ లానే మీరు కూడా మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

First published:

Tags: Pro Kabaddi League, Sports

ఉత్తమ కథలు