హోమ్ /వార్తలు /క్రీడలు /

PKL 2022 : పాంథర్స్ కు భారీ ఝలక్ ఇచ్చిన తలైవాస్.. అదరగొట్టిన నరేందర్

PKL 2022 : పాంథర్స్ కు భారీ ఝలక్ ఇచ్చిన తలైవాస్.. అదరగొట్టిన నరేందర్

PC : TWITTER

PC : TWITTER

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 2022 సీజన్ లో ఎట్టకేలకు తమిళ తలైవాస్ (Tamil Thalaivas) మరో గెలుపును నమోదు చేసింది. పుణె వేదికగా జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో వారం పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38-27తో జైపూర్ పింక్ పాంథర్స్ (Pink Panthers) ఘనవిజయం సాధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 2022 సీజన్ లో ఎట్టకేలకు తమిళ తలైవాస్ (Tamil Thalaivas) మరో గెలుపును నమోదు చేసింది. పుణె వేదికగా జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో వారం పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38-27తో జైపూర్ పింక్ పాంథర్స్ (Pink Panthers) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో టోర్నీలో తమిళ్ తలైవాస్ రెండో గెలుపును నమోదు చేసుకుంది. 7 మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచిన తలైవాస్.. మరో నాలుగింటిలో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ప్రస్తుతం తమిళ్ తలైవాస్ 15 పాయింట్లతో కొనసాగుతుంది. పింక్ పాంథర్స్ 26 పాయింట్లతో ఉంది. ఆరంభం నుంచే తలైవాస్ ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడారు. నరేందర్ 13 రెయిడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ 9 పాయింట్లు సాధించాడు.

అనంతరం హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరకు 27-27తో డ్రాగా ముగిసింది. చివరి నిమిషం వరకు ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే చివరికి మ్యాచ్ టైగా ముగిసింది. పుణేరి పల్టాన్ రెయిడర్ మోహిత్ గోయల్ 11 పాయింట్లతో సూపర్ 10ను పూర్తి చేశాడు. హరియాణా తరఫున మంజీత్, మీతు చెరో 8 పాయింట్ల చొప్పున సాధించారు.

ఇక చివరిగా పట్నా పైరేట్స్, యూపీ యోధా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య ఆధిపత్యం పలుమార్లు మారిన ఈ మ్యాచ్ లో పట్నా పైరేట్స్ 34-29తో యూపీ యోధాపై నెగ్గింది. యూపీ యోధా తరఫున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగాడు. ఒకే రైడ్ లో ఏకంగా 5 గురు ప్లేయర్స్ ను అవుట్ చేసిన ప్రదీప్ నర్వాల్ కేక పెట్టించాడు. ఇక పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 11 పాయింట్లు సాధించాడు.

First published:

Tags: Bangalore, Hyderabad, Kabaddi, Pro Kabaddi League, Tamil nadu

ఉత్తమ కథలు