PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో తెలుగు టైటాన్స్ (Telugu Titans) రాత మారడం లేదు. సొంత ప్రేక్షకుల మధ్య కూడా విజయాలను సాధించలేకపోతుంది. యు ముంబా (U Mumba)తో జరిగిన గత మ్యాచ్ లో నెగ్గిన తెలుగు టైటాన్స్.. సొంత గడ్డపై రెచ్చిపోతుందని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి మ్యాచ్ లోనే చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-36తో పట్నా పైరేట్స్ చేతిలో ఓడిపోయింది. కేవలం ఒక్క పాయింట్ తోనే ఓడటం తెలుగు టైటాన్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆఖరి రెండు నిమిషాల్లో వరుసగా పాయింట్లు సాధించి ప్రత్యర్థిని ఆలౌట్ చేసినా ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది.
తెలుగు టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. ఇక ట్యాకిల్స్ లో విశాల్ భరద్వాజ్ 8 పాయింట్లతో పట్నా రెయిడర్లను పట్టేశాడు. అయినప్పటికీ ఆరంభంలో చేసిన పొరపాట్లు జట్టు విజయావకాశాలను దెబ్బ తీశాయి. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లతో మెరిశాడు. రోహిత్ గులియా 6 పాయింట్లతో అతడికి సహకరించాడు. ఈ మ్యాచ్ ద్వారా సిద్ధార్థ్ దేశాయ్ ప్రొ కబడ్డీ లీగ్ లో 600 రెయిడ్ పాయింట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ 2 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచి 15 మ్యాచ్ ల్లో ఓడింది. 15 పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంల ో కొనసాగుతుంది.
???????????? ???????????????????????????? ???????????? ???????????????? ????☠️#vivoProKabaddi #FantasticPanga #TTvPAT pic.twitter.com/gBVwziLxNI
— ProKabaddi (@ProKabaddi) November 22, 2022
Thalaivas on a roll with back-to-back wins ???? Who was the star performer of the game for you?#vivoProKabaddi #FantasticPanga #MUMvCHE pic.twitter.com/2rl72TJRT4
— ProKabaddi (@ProKabaddi) November 22, 2022
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ 34-20 తేడాతో యు ముంబాపై ఘనవిజయం సాధించింది. తమిళ్ తలైవాస్ తరఫున సాగర్ 8 పాయింట్లతో మెరిశాడు. నరేందర్ 7 పాయింట్లు సాధించాడు. ఇక యు ముంబా ప్లేయర్లు తేలిపోయారు. గుమన్ సింగ్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. తమిళ్ తలైవాస్ 48 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. యు ముంబా 44 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. టాప్ 6లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్ చేరతాయి. 3 నుంచి 6 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కోసం జరిగే నాకౌట్ రౌండ్ (క్వార్టర్ ఫైనల్స్)లో ఆడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kabaddi, Mumbai, Patna, Pro Kabaddi League, Tamil nadu