PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారంతో లీగ్ దశ ముగియనుంది. నాకౌట్ దశ కోసం 11 జట్లు పోటీ పడుతున్నాయి. పేలవ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ (Telugu Titans) మాత్రమే నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) వేదికగా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers) 45-25తో బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls)పై ఘనవిజయం సాధించింది. పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్ వాల్ 13 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు తరఫున భరత్ 10 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ విజేతగా నిలిచింది.
ఈ విజయంతో జైపూర్ పింక్ పాంథర్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. 19 మ్యాచ్ ల్లో 13 విజయాలు 6 పరాజయాలతో మొత్తం 69 పాయింట్లు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రెండో స్థానంలో పుణేరి పల్టాన్ ఉంది. అనంతరం ఉత్కంఠభరితంగా సాగిన దబంగ్ ఢిల్లీ , తమిళ్ తలైవాస్ మ్యాచ్ 37-37 పాయింట్లతో టైగా ముగిసింది. ఆఖరి నిమిషాల్లో దబంగ్ ఢిల్లీ అద్భుత ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా నవీన్ కుమార్ రెయిడ్ పాయింట్లతో హోరెత్తించాడు. నిమిషం కంటే తక్కువ సమయం ఉన్నపుడు తమిళ్ తలైవాస్ ను అవుట్ చేసిన దబంగ్ ఢిల్లీ స్కోర్లను సమం చేసింది. ఈ మ్యాచ్ లో నవీన్ కుమార్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నరేందర్ 14 పాయింట్లు సాధించాడు. తమిళ్ తలైవాస్ 55 పాయింట్లతో ఐదో స్థానంలో.. దబంగ్ ఢిల్లీ 53 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
Panthers mean business here ????
With this win, they become the new table-toppers ????#vivoProKabaddi #FantasticPanga #BLRvJPP pic.twitter.com/aebLlq3dDM — ProKabaddi (@ProKabaddi) November 30, 2022
Narender continues to shine for the Thalaivas with a Super ???? Show some ???? for the young raider in the comments section ????????#vivoProKabaddi #FantasticPanga #DELvCHE pic.twitter.com/sdyf049c6s
— ProKabaddi (@ProKabaddi) November 30, 2022
వచ్చే వారంతో లీగ్ దశ ముగియనుంది. తొలి ఆరు స్థానాల్ల ో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. టాప్ 2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంటాయి. మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు ఎలిమనేటర్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. మూడు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య.. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో గెలిచిన రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Delhi, Jaipur, Kabaddi, Pro Kabaddi League, Tamil nadu