PKL 2022 Final : నెల రోజులకు పైగా అలరిస్తూ వస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ (Pro kabaddi League) 2022 సీజన్ కు నేటి (డిసెంబర్ 17)తో ఎండ్ కార్డ్ పడనుంది. శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో తాజా సీజన్ కు శుభం కార్డు పడనుంది. టైటిల్ కోసం జైపూర్ పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers), పుణేరి పల్టాన్ (Puneri Paltan) జట్ల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. శనివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ఈ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఇరు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అయితే లీగ్ చివరి దశలో జైపూర్ పింక్ పాంథర్స్ సూపర్ ఫామ్ లోకి వచ్చింది.
సెమీఫైనల్ పోరులో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ను 29-49 స్కోరు తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ మట్టికరిపించింది. ఇక అదే సమయంలో పుణేరి పల్టాన్ తన సెమీస్ పోరులో 39-37తో తమిళ్ తలైవాస్ పై చెమటోడ్చి నెగ్గింది. ప్రస్తతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే జైపూర్ పింక్ పాంథర్స్ కాస్త ముందంజలో ఉంది. అయితే ఈ సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ దశలో ఇరు జట్లు కూడా రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు సార్లు కూడా పుణేరి పల్టాన్ నే విజయం వరించింది. ఇది పుణేరి జట్టుకు సానుకూల అంశం అని చెప్పవచ్చు.
THIS IS IT ????#vivoProKabaddi #FantasticPanga #BhidegaTohBadhega #vivoProKabaddiPlayoffs #vivoProKabaddiFinal #vivoPKL2022Final #vivoPKL2022Playoffs #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/70AYjz8uqV
— ProKabaddi (@ProKabaddi) December 15, 2022
జైపూర్ పింక్ పాంథర్స్ విషయానికి వస్తే అర్జున్ దేశ్ వాల్, అజిత్ కుమార్, శౌల్ కుమార్, మొహమ్మద్ రెజా, అంకుశ్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెయిడ్ పాయింట్లు సాధించిన ప్లేయర్ గా అర్జున్ దేశ్ వాల్ ఉన్నాడు. 232 సక్సెస్ ఫుల్ రెయిడ్స్ ద్వారా 290 పాయింట్లు సాధించాడు. ఇక ప్రత్యర్థిని పట్టేయడంలో కూడా జైపూర్ పింక్ పాంథర్స్ డిఫెండర్లే ముందున్నారు. ఈ సీజన్ లో అంకుశ్ 86 ట్యాకిల్ పాయింట్లతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రెండో స్థానంలో మరో జైపూర్ పింక్ పాంథర్స్ డిఫెండర్ రెజా ఉండటం విశేషం. వీరిద్దరు మరోసారి చెలరేగితే పుణేరి రెయిడర్లు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. ఇక మరోవైపు పుణేరి పల్టాన్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. సమష్టిగా ఆడటంలో పుణేరి పల్టాన్ సక్సెస్ అవుతుంది. పంకజ్ మొహిత్, గౌరవ్, సంకేత్ లతో ఈ జట్టు కూడా బలంగా ఉంది. ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jaipur, Kabaddi, Pro Kabaddi League, Pune